చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని గాంధీ పార్క్ ఏరియాలో నేస్తం యూత్
ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయక విగ్రహం వద్ద బుధవారం అన్నదాన కార్యక్రమం
నిర్వహించారు. 12వ వార్డు కౌన్సిలర్ తాడూరు శిరీష పరమేష్, 4వ వార్డు కౌన్సిలర్ సందగళ్ళ విజయ సతీష్ గౌడ్, 11వ వార్డు కౌన్సిలర్ పోలోజు శ్రీధర్ బాబు, 18వ వార్డు కౌన్సిలర్ కామిశెట్టి శైలజ భాస్కర్ లు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు వారు గణనాధునికి
8వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు ఉష్కాగుల శ్రీను,గౌడ్ నల్ల బాలరాజు యాదవ్, కుంటలు శ్రీకాంత్, మారుపాక కార్తీక్, సందగళ్ళ కిరణ్, బోయినిక్రాంతి, కూనూరు శ్రీకాంత్, ఉయ్యాల ఉదయ్, పగిళ్ల శివ, ప్రగత్, సాయిరాం, విశాల్, విక్రమ్
తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: