తూప్రాన్ పేట్ విలేజ్ లోఉన్నటువంటితెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ స్కూల్ ఆధ్వర్యంలో స్వచ్ఛ గురుకుల్ అనే నినాదంతో గౌరవ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ వెన్ రెడ్డి రాజు గారు ముఖ్యఅతిథిగా పాల్గొని
పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి విద్యార్థులకు తగు సూచనలు వివరించడం జరిగినది.
ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించాలని కోరారు
విద్యార్థులలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను వారికి వివరించడం జరిగినది.విద్యార్థులు కష్టపడి చదివితే ఎంతటి గమ్యాన్ని చేరుకోగలుగుతారని అన్నారు
ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్లు, ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి విద్యార్థి దశ నుండి ప్రారంభమవుతుందని గుర్తు చేశారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని 75 సంవత్సరాల క్రితమే
ముందు ఆలోచనతోటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ సమాన హక్కుని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కుని పొందే విధంగా రాజ్యాంగంలో రూపొందించారని గుర్తు చేశారు
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు మనం ఈ స్థాయికి ఎదగలిగామని అన్నారు

Post A Comment: