మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎస్.సి. రిజర్వేషన్ పరిరక్షణ సమితి (SCRPS). పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు భూష్పక సంతోష్ మహారాజ్ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారికి వినతి పత్రం సమర్పిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళితులకు ఎంతో మేలు చేసేదిగా ఉంది. అయితే ఈ దళిత బంధు పథకాన్ని నిజమైన హిందూ దళితులకు మాత్రమే అందేలా చేయాలి. కన్వర్టెడ్ క్రైస్తవులకు ఎస్.సి. హోదాలో దళితబంధును ఇవ్వడం సరికాదు. ఒకవేళ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇవ్వదలచినా, వారికి BC-C సర్టిఫికెట్ మంజూరు చేసి ఆ కోటాలోనే దళితబంధు అందేలా చేయాలి; ఎందుకంటే రాజ్యాంగంలోని ఆర్టికల్-341(6) మరియు 1950(3) రాష్ట్రపతి (రాజ్యాంగ) ఉత్తర్వుల ప్రకారం SC లు క్రైస్తవం లేదా ఇస్లాం మతం స్వీకరిస్తే వారికి SC హోదా వర్తించదు. G.O.Ms.No.1793, Education dept., dated:23.09.1970 ప్రకారం మతం మారిన SCలు BC-Cలుగా పరిగణించబడతారు కాబట్టి మతం మారిన క్రైస్తవులకు దళితబంధు పథకాన్ని SC కోటాలో అమలు చేయొద్దని, అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి రాజ్యాంగబద్ధమైన నిజమైన హిందూ దళితులకు మాత్రమే దళితబంధు పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నాము. లేనియెడల డా॥బి.ఆర్. అంబేద్కర్ మరియు భారత రాజ్యాంగాన్ని మోసపుచ్చడమే అవుతుంది.అంతేకాక క్రైస్తవం స్వీకరించిన వారికి లేదా వారి పిల్లలకు SC కుల హోదా వర్తించదు కాబట్టి అలాంటి వారికి ఎస్.సి. కులం సర్టిఫికెట్ మంజూరు చేయడం రాజ్యాంగ విరుద్ధం, క్షేత్రస్థాయిలో సరైన విచారణ జరపకుండా సర్టిఫికెట్స్ జారీ చేయడం కూడా చట్టప్రకారం నేరమే అవుతుంది. కావున మతం మారిన వారికి బి.సి.-సి సర్టిఫికెట్ మంజూరు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని తద్వారా నిజమైన దళితులకు అన్యాయం కాకుండా ఉంటుందని తమరితో అభ్యర్ధిస్తున్నాము.ఈ కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు అరుమ్ముల్ల శ్రుజన్, వంశీ, శ్రీమన్, ప్రేమ్ అంజి, శ్రవణ్, సిద్దు, వంశీ, కిరణ్ ,చరణ్, సాయి వివిధ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Post A Comment: