ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ జిల్లా పర్వత గిరి లో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విద్యార్థినులతో కలిసి వినాయక నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు. పర్వత గిరి నుండి హనుమకొండ కు వెళుతున్న మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్ కి పర్వతగిరి సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్ విద్యార్థినిలు నిన్న వినాయక చవితి సందర్భంగా తమ స్కూల్ లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాన్ని, స్థానిక చెరువులో నిమజ్జనం చేయడానికి ఊరేగింపు గా వెళుతూ తారస పడ్డారు. వెంటనే కాన్వాయ్ ని ఆపిన మంత్రి, ఆ విద్యార్థినులతో కలిసి కొంత దూరం ఊరేగింపు లో పాల్గొన్నారు. వారితో కలిసి గణపతి నినాదాలు చేశారు. కొద్ది దూరం ప్రయాణించి, వాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గణపతి విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఎలాంటి విఘ్నాలు కలగకుండా జరగాలని కోరుకున్నారు. ప్రజలు, ప్రత్యేకించి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించిన వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

Post A Comment: