ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
నారీ పురస్కారం కోసం అర్హులైన వారి నుండి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత తెలిపారు,
భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం అంతర్జాతీయమహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సామాజిక, ఆర్థిక, సాధికారత రంగాలలో కృషి చేసిన మహిళలకు "నారీ శక్తి" అనే జాతీయ అవార్డుతో సత్కరిస్తుందని.
ఈ అవార్డు రాబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8, 2023 న నిర్వహించి "నారీ శక్తి పురస్కారం 2022" ప్రదానం చేయబడుతుందని.
ఈ విషయంలో, నారీ శక్తి పురస్కారం కోసం నామినేషన్లు ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే చేయాలని, పూర్తి వివరాలకు మరియు నామినేషన్ల ఆన్లైన్ కోసం www.awards.gov.in పోర్టల్ లాగిన్ చేసి వివరాలను పొందు పరచాలని, నామినేషన్లను అక్టోబర్ 31,2022 లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత పేర్కొన్నారు.

Post A Comment: