ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ దేశాయిపేటకు చెందిన నూతన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పించన్ లబ్ధిదారుల ఇండ్లకు వెల్లి కొత్త పెన్షన్ల ను లబ్ధిదారులకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండుసుధారాణి అందజేశారు. సంతోషంతో లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ వృద్దులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు ఆసరా పించన్లు అందజేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దదిక్కుగా నిలిచారన్నారు. ప్రతీ పేదింటి వెలుగు కేసీఆర్ అన్నారు. వృద్యాప్యంలో వృద్దులు ఎవరిముందు చేయిచాచకుండా ఆత్మగౌరవంతో బ్రతికేలా 2016 రూపాయల పించన్ ను,దివ్యాంగులకు 3016 రూపాయల పించన్ అందజేస్తున్నారన్నారు.
సమైక్య పాలనలో 200 పించన్ రావాలంటే కాళ్ళకు చెప్పులరిగేలా తిరగటం, లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పైరవీలకు తావులేకుండా పారదర్శకంగా ప్రజలకు ఫలాలు అందుతున్నాయన్నారు. నూతనంగా రాష్ట్రంలో 10 లక్షల పై చిలుకు లబ్దిదారులకు కొత్త పించన్లు అందజేస్తున్నారని,అర్హత ఉండి రాని వారికి తిరిగి పించన్ అందజేస్తామన్నారు. అర్హులందరికి కొత్త పించన్లు అందుతాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు పించన్లు అందిస్తుంటే కొన్ని పార్టీలు ఉచితాలు ఇవ్వకూడదంటూ పించన్లను రద్దు చేయించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. పేదల ఆత్మబంధువు కేసీఆర్ కు మనమంతా అండగా నిలవాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలో, మంత్రి కే.టీఆర్ మార్గనిర్దేశనంలో ఈ రాష్ట్రం, నియోజకవర్గం సుభిక్షంగా ముందుకు సాగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ కావటి కవిత రాజుయాదవ్, ముఖ్య నాయకులు,అధికారులు పాల్గొన్నారు.

Post A Comment: