ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, ముందస్తు ప్రణాళిక ప్రకారం నివాస ప్లాట్లు, భూ కబ్జాలకు పాల్పడుతూ, అక్రమ నిర్మాణాలు అంటూ బాధితులను భయబ్రాంతులకు గురిచేస్తూ ఒక ముఠాగా ఏర్పడి ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్న భూపాలపల్లి పట్టణానికి చెందిన రౌడీ షీటర్ నాగవెల్లి రాజలింగ మూర్తి పై జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి సురేందర్ రెడ్డి పిడి యాక్ట్ ప్రయోగించారు. పదే పదే నేరాలకు పాల్పడడంతో పాటు, ఇంతకుముందు పలుమార్లు వివిధ కేసుల్లో భూపాలపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినప్పటికి, అతని ప్రవర్తనలో మార్పు రాక పోగా, అక్రమ సంపాదనకు అలవాటుపడి, భూకబ్జాలు బెదిరింపులు కొనసాగించడంతో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పీడీ యాక్ట్ ప్రయోగించాల్సి వచ్చిందనీ ఎస్పి పేర్కొన్నారు. రాజలింగ మూర్తి సహచరులతో ఒక గ్యాంగ్ ఏర్పరుచుకొని ప్రణాళిక రూపొందించుకొని, భూపాలపల్లి పరిధిలలో గల అమాయక భూ యజమానులను, ప్లాట్ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకొని వారిని దోపిడీ చేసే ఉద్దేశంతో వారి ఆస్థులను భూములను కబ్జా చేసే ఆలోచనతో వారిని చంపుతానని బెదిరించి వారి నిర్మాణాలను కూల్చేస్తామని భయబ్రాంతులకు గురి చేసి వారి దగ్గర డబ్బులు దండుకుంటాడు. మూర్తి హెచ్చరికలను పట్టించుకోక పోతే బాధితులను చంపుతానని బెదిరింపులకు పాల్పడతాడు. ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాల వలన సమాజం, శాంతి భద్రత కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున తగిన చర్యలు తీసుకోవడం జరిగింది.
ఇటీవల కాలం లో 2022లో అతి తక్కువ కాల వ్యవధిలో భూకబ్జాలకు సంబంధించిన నేరాలకు రాజ లింగ మూర్తి పాల్పడ్డాడు. ఇందులో ప్రైవేట్ భూములతో పాటు ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేయుటకు ప్రయత్నించాడు. ఈ భూములు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధి లోనివే మూర్తి ప్రమేయం ఉన్న 4 క్రిమినల్ కేసులు నమోదుఅయ్యాయి. దీంతో ముద్దాయి యొక్క ప్రస్తుత నిర్బంధనకు కారణాలు అయ్యాయి.
లింగమూర్తి పై
గతంలో కూడా అనగా (2010) నుండి (2022) చేసిన మొత్తం నేరాలు 08 ఉన్నాయి. అందులోంచి ముద్దాయి 8 కేసులు కేవలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో చేశారు. ఈ కేసులన్నీ రాజ లింగమూర్తి యొక్క గత నేర చరిత్ర తెలుపుతున్నాయి. పిడి యాక్ట్ ఉత్తర్వులను తేదీ 30.08 .2022 రోజు ముద్దాయికి భూపాలపల్లి పోలీసులు సర్వ్ చేసి చర్లపల్లి సెంట్రల్ జైల్ కు తరలించడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్పి జె. సురేందర్ రెడ్డి మాట్లాడుతూ గుండాయిజానికి జిల్లాలో తావులేదని, కబ్జాల పేరుతో పేదలను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు. ప్రజలను బెదిరింపులకు పాల్పడితే ఎవరైనా సరే వదిలిపెట్టబోనని ఎస్పీ అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఎంతటి వారినైనా వదిలే సమస్య లేదని, ఈ క్రమంలోనే రాజలింగమూర్తి పై పిడి యాక్ట్ నమోదు చేశామని తెలిపారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ భూకబ్జాలు, బెదిరింపులకు చట్ట పరమైన చర్యలు తప్పవన్నారు. అసాంఘిక కార్యకలాపాలు చేసే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్పి హెచ్చరించారు.

Post A Comment: