ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జిల్లాలో వివిధ కేసుల్లో పట్టుబడి ఎవరూ క్లెయిమ్ చేయని పాత వాహనాలను ఈనెల 13న ఉదయం 11 గంటలకు వేలం వేయనున్నట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి శనివారం తెలిపారు. జిల్లా ఆర్ముడ్ రిజర్వు హెడ్ క్వార్టర్స్ లో ఈ వేలం జరుగనుoదని, వివరాలకు ఎంటిఓ ను 9440904699, 9912794066 ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. వేలంలో పాల్గొనే వారు ఆధార్ కార్డు, లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు కలిగివుండాలని ఎస్పి పేర్కొన్నారు.

Post A Comment: