మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: మండలంలోని కన్నెపల్లి లక్ష్మీ బ్యారేజ్,(పంప్ హౌస్) లోని మట్టి వర్షాల ప్రభావం వల్ల పంట పొలాల్లోకి చేరి పంటకు తీవ్ర కష్టాలతో పాటుగా నష్టాలు ఎదురవుతున్నాయని స్థానిక రైతు జగన్ ఆవేదన వ్యక్తం చేశాడు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కన్నెపల్లి లక్ష్మీ బ్యారేజ్ నిర్మాణాల్లో భాగంగా,మట్టిని తోడి పెద్ద పెద్ద గుట్టల మాదిరిగా కుప్పలు పోశారు. పోసిన మట్టి,ప్రతి సంవత్సరం వర్షాలు కురిసే సమయంలో,ఆ వర్షపు నీరుతో పాటు,మట్టి కూడా పంట పొలంలోకి కొట్టుక రావడంతో జగన్ అనే రైతుకు పంట నష్టం కలిగిస్తుందని తన గోడు వెల్లబోసుకున్నాడు. సంబంధిత అధికారులకు ప్రతి సంవత్సరం ఎన్నిసార్లు విన్నవించిన కానీ, ఇప్పటివరకు ప్రహరీ గోడ పూర్తిగా నిర్మించకపోవడం వలన,వర్షం కురిసిన ప్రతిసారీ మట్టి కొట్టుకు రావడం,కొట్టుక వచ్చిన మట్టి వల్ల రహదారులు బురద మయంగా మారడంతో బీరసాగర్ గ్రామం నుండీ వచ్చే వెళ్లే ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇప్పటికైనా బ్యారేజ్ అధికారులు నిర్లక్ష్యం వీడి, మా ఇబ్బందులను గుర్తించి, వెంటనే స్పందించి ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చేసి,తమకు న్యాయం చేయాలని,రైతు వేడుకుంటున్నాడు.


Post A Comment: