ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో మైలారం రిజర్వాయర్ లో 9లక్షల 12 వేల చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందన్నారు.
కుల వృత్తుల అభ్యున్నతికి సీఎం కేసీయార్ కృషి చేస్తున్నారు.
మత్స్యకారుల సంక్షేమానికి 500కోట్లు ఖర్చు చేసినం.
అన్ని వర్గాల అభివృద్ధికి చేయూతనిస్తున్నాం.
ఉద్యోగాల కల్పనతో పాటు స్వయం ఉపాధి అవకాశాల కల్పనకూ పెద్ద పీట వేస్తున్నాం.
కాళేశ్వరం నీళ్లు, 24 గంటల కరెంట్ తో వ్యవసాయం పండుగలా మారింది.
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ గా నిలుస్తోంది.
ఇక మైలారం పోతే మంచి చేపలు దొరుకుతాయి అనే పేరు తీసుక రావాలి.
మంచి స్థలం చూసి హోల్ సెల్ మార్కెట్ ఏర్పాటు చేయండి.
బిల్డింగ్ కట్టిస్తా. కోల్డ్ స్టోరేజ్ కూడా ఇస్తాను.
మత్స్య కార్మికులు మంచిగా అభివృద్ధి కావాలి.
మరో పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి.
మహిళా మత్స్య కార్మికులు ఇంకా అవగాహనా పెంచుకొని మార్కెటింగ్ లో నైపుణ్యం సాధించాలి.
బిజినెస్ బాగా చేసి... మీ సంఘ సభ్యులు పంచుకోవాలి.
మైలారంలో మహిళలకు ప్రత్యేక షాప్ కేటాయించుతా.
గతంలో వేరే రాష్ట్రం నుండి చేపలు వచ్చేవి.
కానీ, ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మన రాష్ట్రం నుండే వేరే ప్రాంతాలకు చేపలను ఎగుమతి చేస్తున్నాం.
ఇలా ఇంకా చాలా అభివృద్ధి జరిగి మత్స్య కార్మికుల కుటుంబాలు ఆర్ధికంగా నిలబడాలి.
కుల వృత్తులను కాపాడుకోవాలన్న తపనతో అన్ని కులాల సంక్షేమం కోసం మన ముఖ్య మంత్రి ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టారు.
కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే గతంలో పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ నేడు చనిపోయిన వ్యక్తి కుటుంబం వీధిన పడకూడదు అని.. 5 లక్షల బీమా ఇస్తున్న ఏకైక ముఖ్య మంత్రి మన కెసిఆర్.
పట్టుబట్టి రిజర్వాయర్ నిర్మాణం చేసుకున్నాం.
నీళ్లు వదలాలి అని కూడా కొట్లాడిన....ఆనాడు సంవత్సరంలో పది రోజులు నీళ్లు ఉంటే సంబర పడేది
కానీ కాళేశ్వరం వల్ల ప్రతీ చెరువు.. కుంట... రిజర్వాయర్ లో 365 రోజులు నీళ్లు నిండి, నిండు కుండలా ఉంటున్నాయి.
వరంగల్ జిల్లా లో ఏకైక రిజర్వాయర్ ఇది.
జిల్లా కలెక్టర్ గోపి మాట్లాడుతూ
జిల్లాలోని చెరువుల్లో
రెండు నెలల్లో రెండు కోట్ల చేప పిల్లలను ఉచితంగా వదిలేందుకు అన్ని ఏర్పాట్లు చేసాం.
దీనిని మత్స్య కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి.
మంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఈ ప్రాంతన్ని టూరిజం పరంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటాము.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు, మత్స్యకారులు, ప్రజలు పాల్గొన్నారు.

Post A Comment: