ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

జిల్లా లో ఈ నెల 16 నుండి 18 వరకు మూడు రోజుల పాటుజరిగే తెలంగాణా  జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలనీ  కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు , అధికారులకు ఆదేశించారు.  

శనివారం నాడు కలెక్టర్ బంగ్లా  నందు నోడల్ అధికారులతో కలెక్టర్  అదనపు జాయింట్ కలెక్టర్ సంధ్యా  రాణి  తో కలసి సమీక్ష సమావేశం  నిర్వహించారు.

 ఈ  సందర్బంగా అయన మాట్లాడుతూ ఈ నెల 16 నుండి 18 వరకు తెలంగాణా జాతీయ సమైక్యత వ జ్రో త్సవాలను ఘనంగా జరుపుకోవాలని, జిల్లా  కేంద్రం తో పాటు గా పరకాల నియోజవర్గంలో  మూడు రోజుల పాటు జరిగే వజ్రోత్సవాల  నిర్వహించడానికి  అన్నీ ఏర్పాట్లు పూర్తి చేయాలనీ అన్నారు.16 వ తేది నాడు హయ గ్రీవా చారీ  మైదానం నుండి  ఆర్ట్స్ కాలేజీ వరకు 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించుటకు, తగిన ఏర్పాట్లు చేయాలనీ సూచించారు .

పోలీస్, రెవెన్యూ, జిల్లా అధికారులు,   మేధావులు విద్యార్థులు,ప్రజలు అందరు ఇందులో భాగస్వాములు అయ్యే విధంగా చుడాలి అని అన్నారు. పరకాల  నియోజకవర్గం లో ఇదే విధంగా  ఏర్పాటు చేయాలనీ  తెలిపారు ,ప్రతి మండలం నుండి మహిళా సంఘాలు, జడ్ పి టి సిలు, ఎం పి టి సిలు, సర్పంచులు , పంచాయతి సెక్రటరీలు, వార్డ్ మెంబర్లు,  ప్రజలు వచ్చేటట్లు చూడాలని, ఆదేశించారు. ఒక్కొక మండలానికి స్పెషల్ అధికారులు ఉండి ఈ  కార్యక్రమం విజయవంతం చేయాలి అని అన్నారు.స్టేజ్ ఏర్పాటు, పబ్లిక్ అడ్రెస్స్  సిస్టం, శానిటేషన్, డస్ట్ బిన్లు ఏర్పాటు , త్రాగు నీరు ,  బ్యానర్లు,  రవాణా సౌకర్యాలు, భోజన సమయం లో కౌంటర్ వారిగా ఏర్పాటు చేయాలనీ ఆదేశించారు.   వైద్య, ఫైర్ సిబ్బంది  అందుబాటులో ఉండాలి అని అన్నారు.17 వ  తేది నాడు   ఆగష్టు 15 మాదిరిగానే   ఏర్పాట్లు ఉండాలి అని అన్నారు.  అదే రోజు   హైదరాబాద్ కి వెళ్లే సిబ్బంది అందరు బస్సులలో బయల దేరాలని , అధికారులు బస్సులకు లైజన్ అధికారులుగా నియమించాలి  అని తెలిపారు.

 18  వ  తేదీ న అంబేద్కర్ భవన్ లో  స్వతంత్ర సమర  యోధులకు  సన్మానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేదుకు ఏర్పాట్లు చేయాలనీ  ఆదేశించారు.

 ఈ సమావేశంలో డిఆర్ఓ వాసు చంద్ర, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మెన శ్రీను, డిపిఓ  జగదీశ్, మేప్మా పిడి బద్రు నాయక్, జిల్లా అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: