చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపాలిటీలో అభివృద్ధి
పనులు శరవేగంగా సాగుతున్నాయి. మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు
పలు వార్డులో సంబంధిత వార్డు కౌన్సిలర్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మున్సిపల్ పరిధి 5వ వార్డు
పెద్దమ్మ కాలనిలో ,2 వ వార్డు తెల్లసింగారం, 19 వ వార్డు మసీదు పక్కన సీసీ రోడ్లు,అంతర్గత డ్రైనేజీ లకు శంకుస్థాపన చేశారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగులో ఉన్న పనులు కార్యరూపం దాలుస్తుండడంతో కాలనీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ, వార్డు సభ్యులకు, ఛైర్మెన్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం,కౌన్సిలర్లు పోలోజు శ్రీధర్ బాబు, పోలోజు వనజ
అనిల్,రాజ్యలక్ష్మి స్వామి, బాబా షరీఫ్, గోపగోని లక్ష్మణ్,కామిశెట్టి శైలజభాస్కర్,గ్రంథాలయ ఛైర్మెన్ ఉడుగు మల్లేష్, సందగళ్ల సతీష్,బండమీడి మల్లేష్, ఆలే నాగరాజు తదితరులు పాల్గొన్నారు...

Post A Comment: