ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరీ రమేశ్, డీసీసీబీ చైర్మన్ మార్ణేని రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ
స్వాతంత్రోద్యమంలో నిజాం కు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళలో ఒక్కరైనా బీజేపీ వాల్లున్నారా?
గాంధీని చంపిన గాడ్సే ఎవరు? ఎవరి సానుభూతి పరుడు?
తెలంగాణ లో మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ కుట్రలు చేస్తోంది.
తెలంగాణను ఆగం పట్టియ్యాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు
కేసీఆర్ ఉన్నన్ని రోజులు తెలంగాణను ఎవ్వరూ ఆగం చెయ్యలేరు
విలీనం..విమోచనం..అంటూ గాయిగాయి చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి
ఆంధ్రోళ్ల పాలన నుంచి తెలంగాణ కు స్వాతంత్ర్యం తెచ్చిన వ్యక్తి కేసీఆర్
ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీయార్ దే
సంక్షేమ, అభివృద్ది పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం
తెలంగాణలో అమలవుతున్న
పథకాలు.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నయా?
విమర్శలు చేసే ముందు ఓ సారి ఆత్మ విమర్శ చేసుకోవాలి.

Post A Comment: