ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ రోజు పోచమ్మ మైదాన్ జంక్షన్ నుండి సీకేఎం కళాశాల వరకు జాతీయ జెండాలతో బారీ ర్యాలీ నిర్వహించి,అనంతరం నిర్వహించిన సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుదారాణి,కలెక్టర్ గోపి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్,కుడా చైర్మన్ సుందర్ రాజు , కార్పోరేటర్లు, అధికారులు,ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ
రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణా సమాజ పరిణామ క్రమం నేటికి 75 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్బంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా నిర్వహిస్తున్నారు..
రాచరిక పాలన నుండి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు నివాళులు..
భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన ఈ మహత్తర పోరు ఎంతో స్ఫూర్తిదాయకమైనది..
1946 నుండి 1951 వరకూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సాగిన ఈ చారిత్రాత్మక పోరాటంలో సుమారు 4000 పైచిలుకు తెలంగాణ బిడ్డలు నేలకొరిగారు..వారి త్యాగం వెలకట్టలేనిది.
రాచరిక వ్యవస్థనుండి ప్రజాస్వామిక వ్యవస్థలోకి తెలంగాణ అడుగుపెట్టి నేటికి 75 ఏండ్లు అవుతుంది.
స్వరాష్ట్రంలో తెలంగాణా అద్బుత ప్రగతిని సాధిస్తుంది.తెలంగాణా ఉద్యమం పుణర్నిర్మాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణాను అద్బుతమైన పాలన సాగిస్తున్నారు.
సర్వమత సమ్మేళనంగ, ప్రజలంతా సమైక్య భావనతో తెలంగాణాలో జీవిస్తున్నారు. ప్రజలకు అద్బుతమైన ప్రగతి, సంక్షేమఫలాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నారు. అన్ని మతాలు అన్ని కులాలను సమ దృష్టితో ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారు.
జాతి సమైక్యతకు భంగం కల్పించే శక్తులేవో ప్రజలు గమనించాలి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ఎజెండాగా ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది. మత విద్వేశాలు, అసమానతలు లేని తెలంగాణాను ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించారు.సాధించుకున్న తెలంగాణా ప్రగతిశీల రాష్ట్రంగా ముందుకు సాగుతుంది.దుష్టశక్తుల ఎత్తులను చిత్తుచేస్తూ ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు.
తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవాలు మూడు రోజులపాటు ఘనంగా జరుపుకుందాం.
జాతీయ స్పూర్తిని తెలంగాణ భూమిపుత్రులుగా మనం భవిష్యత్ తరాలకు చాటాలి. ఈ సందర్బంగా ఓరుగల్లు వీరగల్లు పోరాటాల పురిటిగడ్డ వరంగల్ చారిత్రక సందర్బాన్ని గుర్తు చేసుకుని ముందుకు సాగుదాం.
సెప్టెంబర్ 17ను గుర్తు చేసుకోవటం అంటే భూపతి కృష్ణమూర్తి, బత్తిని మొగిలయ్యగౌడ్, ఆరెల్లి బుచ్చయ్య,బండారు చంద్రమౌళీశ్వర్ రావు,పీవీ నర్సంహరావు ను గుర్తుచేసుకోవటమే. ప్రజాకవి కాళోజీ ని స్మరించుకోవటమే.ఈ తరానికి మహనీయులు తెలియదు.జాతి సమైక్యత కోసం,రాచరిక పాలన అంతం కోసం జీవితాంతం తపించిన మహనీయుల చరిత్ర భవిష్యత్ తరాలకు అందించే కార్యక్రమం ఇది.
ఖిలా వరంగల్ లో ప్రతీ ఆదివారం జాతీయ జెండా ఎగురవేయటం ఆనాటి స్వాతంత్ర్య సమరయోధుల కార్యక్రమం ఇది సాగుతున్న క్రమంలో బత్తిని మొగిలయ్య గౌడ్ ప్రాణాలు కోల్పోయారు..
రాచరిక పాలనకు వ్యతిరేఖంగా ఆనాడు సాగిన పోరాటంలో బత్తిని మొగిలయ్యగౌడ్ సాహసంగా ఎదుర్కోకపోతే, తన ప్రాణాలు అడ్డుపెట్టి రక్షించకపోతే మేము ప్రాణాలతో ఉండేవాళ్ళం కాము అంటూ నాడు భూపతి కృష్ణమూర్తి అనేక సందర్బాల్లో చెప్పారు. ఆనాటి సంఘటనలు తన డైరీలో భూపతి కృష్ణమూర్తి రాసుకున్నారు.
జాతి స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న జాతిపిత మహాత్మగాంది వెంట వరంగల్ నడిచింది.అంతేకాదు ఆ పోరాటానికి తమవంతు సహాకారం ఆర్థిక సాయం అందించింది. చందాకాంతయ్య, బండారు చంద్రమౌళీశ్వర్ రావు, గిర్మాజి పేట వరంగల్,మట్టెవాడ, శివనగర్, సిరంగి రాజారాం తోట, పోచమ్మమైదాన్, దేశాయిపేట, ఉర్సు, రంగశాయిపేట,ఇలా ఈ వరంగల్ నగరంలో ఎవరికి తోచినంత వారు విరాళం అందించారు. బంగారు ఆభరణాలు విరాళంగా వేసారు. ఇటికాల మదుసూదన్ రావు లాంటి పోరాటయోదులు సాయుదపోరాటంలో పనిచేసారు..పోచమ్మమైదాన్ లో మెన్నటిదాకా జీవించి ఉన్న కమలమ్మ రాచరికపాలనకు వ్యతిరేఖంగా పోరాటం చేస్తూ చివరకు తన బిడ్డలను వదులుకున్న చరిత్ర ఆమెది.
ప్రజాకవి కాళోజీ, దాశరథి, దేవుల్లపల్లి రామానుజారావు లాంటి కవులు,కళాకారులు ఖిలావరంగల్ లో సభ నిర్వహించుకోవాలని చూస్తే ఆనాటి జాతి వ్యతిరేఖ మూకలు, పందిళ్ళను కాలబెటితే ఆకాలిన పందిళ్ళ సాక్షిగా రాచరిక దుర్మార్గ పాలనపై తిరుగుబాటు గళం విప్పారు. ఇది మన చరిత్ర,తెలంగాణా ఇల్లిల్లూ చరిత్ర పొదరిల్లే. ఇంతటి మహోన్నత చరిత్ర మలినం చేయాలనచ కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయి. ఆకుట్రలను దీటుగా ఎదుర్కొందాం.
సాయుద రైతాంగపోరాటం తర్వాత మా నీళ్ళు నిదులు నియామకాలు మాకే కావాలని తెలంగాణా నినదించింది.స్వరాష్ట్ర సాదనకై మలిదశ తెలంగాణ ఉద్యమం నాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 14 ఏండ్ల పాటు సాగింది. తెలంగాణా జాతిని ఏకం చేసి శాంతియుత పంథాలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మలిదశ తెలంగాణా పోరాటంలో ఎందరో వీరులు అమరులైనారు..తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పోరాటాలు చేసారు. స్వరాష్ట్ర పోరాటంలో వరంగల్ పెద్దన్నపాత్ర పోషించింది. సభలు సమావేశాలు,పోరాటాలకు పుట్టినిల్లు మన వరంగల్. తెలంగాణా పోరాటానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ దిక్సూచీగా నిలిచారు.
స్వాతంత్ర్య పోరాట వీరుల ఆశయాలకు అనుగుణంగా నేడు పరిపాలన సాగించుకుంటున్నాం.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రతీ రంగంలోనూ యావత్ దేశం నివ్వెరపోయే ఫలితాలను సాధిస్తూ, ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నది తెలంగాణ అపూర్వ విజయాలను సొంతం చేసుకున్నది.
సమైక్య రాష్ట్రంలో అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాలకు 24 గంటలపాటు అత్యుత్తమ విద్యుత్తును సరఫరా చేస్తున్న ఆదర్శ రాష్ట్రంగా రూపుదాల్చింది. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభంతో సతమతమైన తెలంగాణ నేడు స్వరాష్ట్రంగా 11.6 శాతం రికార్డు స్థాయి వ్యవసాయ వృద్ధిరేటుతో దేశానికి అన్నం పెడుతున్న అన్నపూర్ణగా అవతరించింది.
ఇంటింటా నల్లాలతో స్వచ్ఛమైన తాగునీటిని 100 శాతం గ్రామాలకు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. గొర్రెల పెంపకంలో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిన రాష్ట్రం తెలంగాణ.
గ్రామీణ జీవన ప్రమాణాల్లో దేశంలోనే ప్రప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం మన తెలంగాణ.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల మీద, వ్యవసాయ రంగం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో అత్యధిక అభివృద్ధి సాధ్యమైంది.
సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం వల్ల తెలంగాణ బిడ్డలు కనీస జీవన భద్రత కూడా కరువై చెట్టుకొకరు, పుట్టకొకరై పోయారు. చెదిరిపోయిన తెలంగాణ సమాజానికి భరోసా ఇచ్చి తిరిగి నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసారు.. ప్రతి వర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, కడుపులో పెట్టి చూసుకుంటూ సంక్షేమంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఖ్యాతి పొందింది.
కొత్తగా ఇచ్చే పెన్షన్లతో కలిపి రాష్ట్రంలో మొత్తం 46 లక్షల మందికి ఆసరా పెన్షన్ల ద్వారా లబ్ది చేకూరుతుంది. ఫించన్ల మొత్తం పెంచడమే కాకుండా లబ్దిదారుల సంఖ్యను అత్యధికంగా పెంచడం ద్వారా మన తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిందని సవినయంగా తెలియజేస్తున్నాను.
యావత్ దళిత జాతి స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే వజ్ర సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలుచేస్తున్నారు. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని బ్యాంకు లింకేజీ లేకుండా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా గ్రాంటు రూపంలో అందిస్తున్నారు. వారి జీవితాల్లో అది పెనుమార్పును తీసుకువచ్చింది.
పేదింటి ఆడభిడ్డల పెళ్ళిల్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామగా మారారు. కల్యాణలక్ష్మి - షాదీముబారక్ పథకం ద్వారా ఇప్పటి వరకు 11 లక్షల 24 వేల 684 మంది ఆడపిల్లల పెండ్లిళ్ళకు 1 లక్షా 116 రూపాయల చొప్పున 9 వేల 716 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఘనత తెలంగాణదే.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన, సురక్షితమైన జలాలను నల్లాల ద్వారా ఉచితంగా సరఫరా చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. మిషన్ భగీరథతో 100 శాతం ఆవాసాలకూ మంచినీరందించాం..
సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు దండుగ అని ఈసడించిన వ్యవసాయాన్ని తెలంగాణ ప్రభుత్వం పండుగగా మార్చింది.
రైతురుణ మాఫీ, 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం తదితర భారీ ప్రాజెక్టుల నిర్మాణం, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ, రైతుబంధు, రైతుబీమా పథకాలు వ్యవసాయ విస్తరణాధికారుల నియామకం, రైతు వేదికలు, పంటకల్లాల నిర్మాణం, రైతుబంధు సమితుల ఏర్పాటు ఒకటారెండా అనేక అద్భుతమైన పథకాలను, సంస్కరణలను తీసుకొచ్చింది. రైతులకు ఛార్జీలు లేకుండా కరెంటును, పన్నులు లేకుండా సాగునీటిని అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ.
అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బలోపేతం చేసేందుకు “మన ఊరు – మన బడి” అనే బృహత్తర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారు.. పాఠశాలల్లో అధునాతన మౌలిక వసతుల కల్పనను పెద్దఎత్తున చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 7 వేల 289 కోట్ల రూపాయల వ్యయంతో దశలవారీగా పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 1 లక్షా 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసుకున్నాం. ప్రస్తుతం ప్రభుత్వంలోని వివిధశాఖల్లో ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేసుకుంటున్నాం
తెలంగాణలో నెలకొన్న సర్వమత సామరస్య భావనను ప్రతి బింబిస్తూ బతుకమ్మ, బోనాలు, రంజాన్, క్రిస్టమస్ పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. ఈ పండుగల సందర్భంగా పేదలకు కొత్త బట్టలు పంపిణీ చేస్తున్నది. అన్ని మతాలకూ సమాన గౌరవం అందజేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్..
మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఐ.టి రంగంలో తెలంగాణ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతోంది. 1500 కు పైగా పెద్ద, చిన్న ఐ.టి పరిశ్రమలు నేడు హైదరాబాద్ లో కొలువై ఉన్నాయి. ఐటి రంగ ఉద్యోగాల సృష్టిలో మన రాష్ట్రం కర్ణాటకను అధిగమించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గత 100 ఏండ్లలో జరగని ప్రగతిని చేసి చూపిస్తున్నాం.
సుందరమైన రోడ్లు, డ్రైనేజీలు, వరద నీటి కాలువల నిర్మాణం, పేదలకు ఇంటినెంబర్ల పంపిణి చేపట్టుకుంటున్నాం.
దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రుల్లో ఒకటైన సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఈ నియోజకవర్గంలో నిర్మించుకుంటున్నాం. బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నం.
పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి దశలో ఉంది. సొంత జాగాలో ఇండ్లు నిర్మించుకునేందుకు 3 లక్షల రూపాయల సాయం అందిస్తున్నాం. జర్నలిస్టుల కోసం డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నాం.
ఉచిత నిర్బంధ విద్యతో తెలంగాణ గురుకులాల్లో పేదల పిల్లలకు కార్పోరేట్ స్థాయి విద్య అందుతుంది. ప్రతీ పేదవారి మోమున ఆత్మగౌరవం వెల్లి విరుస్తుంది. ఒకప్పుడు అభివృద్ది,ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడ ఉండేవి కావు. కానీ నేడు కొత్తజిల్లా ఏర్పాటుతో పాటు ఈ ప్రాంతంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేసుకుంటున్నాం. తద్వారా సంపద, వ్యాపారం పెరిగి ప్రజల భూముల విలువలు, వ్యాపార సదుపాయాలు ఉపాది అవకాశాలు లబించేలా కృషి చేస్తున్నాం. టూరిజం హబ్ గా వరంగల్ ను తయారు చేస్తాం.
మోడల్ మార్కెట్ ను నిర్మిస్తున్నాం. ఇకపై తక్కువ ధరలకు నాణ్యమైన, స్వచ్చమైన కూరగాయలు,నిత్యావసరాలు ప్రజలకు అందేలా కృషి చేస్తున్నం. త్వరలో వరంగల్ నూతన బస్టాండ్ నిర్మించబోతున్నాం. అన్ని రంగాల్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు.

Post A Comment: