ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
శివనగర్ బతుకమ్మ, దసరా ఉత్సవ కమిటి అధ్యక్షుడు మర్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పోరేటర్లు దిడ్డి కుమారస్వామి,సోమిశెట్టి ప్రవీణ్ లు శివనగర్ బతుకమ్మ,దసరా ఉత్సవాల గురించి శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. మూడు డివిజన్ల పరిధిలోని బతుకమ్మ, దసరా ఉత్సవాలు శివనగర్ బతుకమ్మ, దసరా ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, తగిన ఏర్పాట్లు చేసేలా అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయాలని వారు ఎమ్మెల్యేను కోరారు. దసరా, బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని, తానూ స్వయంగా భాగస్వామిని అవుతానని ఎమ్మెల్యే వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో అనుముల నగేష్, పొలెపాక నరేందర్, అనీల్, స్వామి, బాలరాజు, శ్యామ్, యాదగిరి, శ్రీనివాస్,వేణు, ప్రభాకర్, సుధాకర్, కుమార్, కుడికల సుధాకర్, గడ్డం శ్రీనివాస్, రాజు, సురేందర్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: