చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ లో బుధవారంరాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు,మెరుపులతో వర్షం ఎడతెరపి లేకుండా కురిసింది.
చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో బస్టాండ్ ఆవరణ,తంగడిపల్లి రోడ్జలమయమయ్యాయి. చౌటుప్పల్
మండలంలోని తుఫాన్ పేట, దండు మల్కాపురం,ఎల్లగిరి, కొయ్యలగూడెం, దేవలమ్మ నాగారం,పీపుల్ పహాడ్, పంతంగి తదితర గ్రామాల్లో భారీవర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలుజలమయమయ్యాయి. వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గణేష్ నవరాత్రులను పురస్కరించుకొని పలు గణనాధుల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
భారీ వర్షంతో భక్తులు ఒకింత ఇబ్బందులకు గురయ్యారు.


Post A Comment: