ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ;
హన్మకొండలోని కుడా కార్యాలయంలో వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన అభివృద్ధి పనుల పురోగతి, జరుగుతున్న, జరగాల్సిన పనులపై మున్సిపాలిటీ అన్నివిభాగాల అధికారులు, కార్పొరేటర్లతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వాటర్ సప్లై జరుగుతున్న తీరు సమస్యలు, పారిశుద్ధ్య నిర్వహణ, మెప్మా, రెవిన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాల్లో జరుగుతున్న పనులు చేపట్టవలసిన పనులు గురించి సంబంధిత శాఖల అధికారులతో మరియు అన్ని డివిజన్ల కార్పొరేటర్లతో ఎమ్మెల్యే సమీక్షించారు. జరుగుతున్న పనులను వేగం పెంచాలని, జరగాల్సిన పనులకు కార్యాచరణ రూపొందించాలని వారికి సూచించారు..
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ , ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కే.టి రామారావు ఈ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని అభివృద్ధికి కావల్సిన నిధులు కేటాయిస్తున్నారని అందుకు అనుగుణంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేసి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో ముందుంచుదామన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పొరేటర్లు, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.


Post A Comment: