ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో డిఎస్పి రాములు గురువారం మీడియా సమావేశం లో మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో ప్రజాదరణ కోల్పోయిన మావోయిస్టులు వారి మకాం ను ఛత్తీస్గడ్ కు మార్చారన్నారు.
15 సంవత్సరాల క్రితం మావోయిస్టులు ప్రజలను ఇబ్బంది పెట్టి మాయమాటలు చెప్పి అభివృద్ది ని అడ్డుకున్నారన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత పోలీసులు గ్రామ గ్రామనా తిరుగుతూ ప్రజలకు అదుబాటులో ఉండి ప్రజలకు దగ్గరయ్యారని,
ప్రజల మద్దతు కోల్పోయిన మావోయిస్టులు ఛత్తీస్గడ్ కు తమ మకాం మార్చారన్నారు.తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని అభివృద్ది పథంలో కి తీసుకు వచ్చిందని, రోడ్లు, విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలలో తెలంగాణ అభివృద్ది చెందిందన్నారు. ప్రజలు ఎవరు కూడా మావోయిస్టుల ప్రలోభాలకు లొంగ కుండా గ్రామాల అభివృద్ది తోడ్పడుతున్నారని,
ప్రశాంతంగా ఉన్న పల్లెలో చిచ్చు పెట్టడానికి మళ్లీ కొన్ని శక్తులు ప్రయోగాలు చేస్తున్నారని, వారి మాయలో పడొద్దన్నారు.
తెలంగాణలో ప్రజల మద్దతు కోల్పోయిన మావోయిస్టులు ఛత్తీస్గడ్ బాట పట్టగా ఛత్తీస్గడ్ మావోయిస్టులకు తెలంగాణ మావోయిస్టుల మధ్య వైరం ఏర్పడిందని,
భూపాలపల్లి మండలం లోని గ్రామీణ ప్రాంత ప్రజలు ఒకవేళ మావోయిస్టులు వస్తే వారికి హితబోధ చేయాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు.
మావోయిస్టులు సమీప గ్రామంలో గాని సమీప అడవి ప్రాంతంలో సంచరించినట్లయితే పోలీసులకు సమాచారం ఇచ్చిసహకరించవలసిందిగా కోరుతున్నామన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయని తెలిపారు. చాలామంది మావోయిస్టు దళ సభ్యులు మావోయిస్టు పార్టీ పట్ల నమ్మకాన్ని కోల్పోయి జనజీవన స్రవంతిలో కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరిస్తున్నారని, కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణలో తమ ఉనికి చాటుకునేందుకు అమాయకులను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు.
నక్సలైట్ గో బ్యాక్ అనే నినాదంతో ప్రజలు ముందుకు సాగాలని, ఏకే లు వద్దు ఏ,బి,సి,డి లు ముద్దు అని నినదించాలన్నారు. కొంత మంది మావోయిస్టు లు లొంగి పోవడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుందని, అలా లొంగి పోయి జనజీవన స్రవంతి లో కలిసే మావోయిస్టు లకు భూపాలపల్లి పోలీసు శాఖ అండగా ఉంటుందన్నారు.

Post A Comment: