ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ

హన్మకొండ; 

ఈ నెల  9న శుక్రవారం  వరంగల్, హన్మకొండ మరియు కాజీపేట ట్రై సిటి పరిధిలో  వినాయక నిమజ్జనం సందర్బంగా  నగరంలో  శోభాయాత్ర నిర్వహించబడుతుంది. కావున నగరంలో  పెద్ద స్థాయిలో నిమర్జనానికి విగ్రహాలను  తరలించే మార్గాల్లో  ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకుగాని ట్రై సిటి పరిధిలో వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వెల్లడించారు.

  ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా  9న శుక్రవారం  మధ్యాహ్నం 2.00 గంటల నుండి  మరుసటి రోజు తేది 10న ఉదయం  10.00 గంటల వరకు  ట్రాఫిక్ ఆంక్షలు కోనసాగుతాయన్నారు.

భారీ వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు. ములుగు, భూపాలపల్లి వైపు నుండి వచ్చు భారీ వాహనములు హైదరాబాద్ కు వెళ్ళవలసినవి ఆరెపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుండి వెళ్ళవలెను. మరియు భూపాలపల్లి పరకాల నుండి ఖమ్మం వెళ్ళవలసినవి ఆరేపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుండి కరుణాపురం, మడికొండ, కడిపికొండ, నాయుడు పెట్రోల్ పంపు నుండి వెళ్ళవలెను.

భూపాలపల్లి మరియు పరకాల నుండి వచ్చు భారీ వాహనాలు నర్సంపేట వైపు వెళ్ళవలసినవి కొత్తపేట, 

రెడ్డిపాలెం, జాన్పీరిలు గొర్రెకుంట వెళ్ళవలెను. సిటి లోపలికి వచ్చు భారీ వాహనములు సిటి అవతల ఆపుకోవలెను. నిమజ్జన  సమయంలో ఎలాంటి  వాహనములు సిటి లోపలికి అనుమతించబడవు.

వరంగల్ నగరంలో తిరుగు అన్ని రకాల వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు.

ములుగు మరియు పరకాల వైపు నుండి వచ్చే బస్సులు వయా పెద్దమ్మగడ్డ నుండి కెయుసి, సి.పి.ఓ. అంబేద్కర్ సెంటర్,  ఏషియన్  శ్రీదేవి మాల్ మీదుగా బస్టాండ్ కు చేరుకోవాల్సిఉంటుంది. హన్మకొండ బస్టాండ్ నుండి బయలుదేరి ములుగు వైపు, కరీంనగర్ వైపు వెళ్ళు బస్సులు వయా ఏషియన్  శ్రీదేవి మాల్, అంబేద్కర్ సెంటర్, సి.పి.ఓ ద్వారా కెయుసి, జంక్షన్ మీదుగా వెళ్ళవలెను.

హన్మకొండ బస్టాండ్ నుండి బయలుదేరి నర్సంపేట, కొత్తగూడెం, భద్రాచలం, తొర్రూరు, ఖమ్మం వైపు వెళ్ళు బస్సులు వయా బాల సముద్రం, అదాలత్, హంటర్ రోడ్ మీదుగా వెళ్ళవలెను.

వరంగల్ బస్టాండ్ నుండి హన్మకొండ వైపు వచ్చు బస్సులు చింతల్ బ్రిడ్జి నుండి రంగశాయిపేట్ మీదుగా నాయుడు పెట్రోల్ పంప్ సెంటర్, ఉర్సుగుట్ట, అదాలత్, బాలసముద్రం రోడ్ మీదుగా హన్మకొండకు చేరుకోవాలి.

వినాయక నిమజ్జన వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు.

సిద్దేశ్వర గుండములో నిమజ్జనం చేసిన తరువాత వాహనాలు శాయంపేట వైపు వెళ్ళే రోడ్డు ద్వారా వెళ్ళవలెను మరియు 6 అడుగుల కన్న ఎక్కువ ఎత్తు కలిగిన విగ్రహాలతో కూడిన వాహనాలు మరియు వినాయక విగ్రహాలతో కూడిన లారీలు సిద్దేశ్వర గుండంలో నిమజ్జనం కు అనుమతించబడవు, ఇట్టి వినాయక విగ్రహ వాహనాలు నిమజ్జనం గురించి కోట చెరువు మరియు చిన్న వడ్డేపల్లి చెరువులకు వెళ్ళవలెను.

శాయంపేట వైపు నుండి వచ్చు వినాయక విగ్రహా వాహనాలు వయా హంటర్ రోడ్, అదాలత్, హన్మకొండ చౌరస్తా మీదుగా ప్రయాణించవలెను.

కోట చెరువు వైపు నిమజ్జనం కొరకు వెళ్ళే వాహనాలు పెద్దమ్మగడ్డ, ములుగు జంక్షన్, యం.జి.యం, ఆటోనగర్  మీదుగా కోటచెరువుకు వెళ్ళవలెను. ఎక్సైజ్ కాలనీ, రెవెన్యూ కాలనీ మరియు వడ్డేపల్లి ప్రాంతాల నుండి వచ్చే వినాయక విగ్రహాలు అన్ని బంధం చెరువులో నిమజ్జనం చేయవలెను.

చిన్నవడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేసిన వాహనాలు ఏనుమాముల రోడ్ నుండి నర్సంపేట రోడ్ వైపునకు వెళ్ళవలెను.

 కోట చెరువులో వినాయక విగ్రహ నిమజ్జన అనంతరం వాహనాలు  హనుమాన్ జంక్షన్ , పెద్దమ్మగడ్డ నుండి  కేయూసి జంక్షన్ మీదగా తిరిగి  వెళ్లాల్సి  వుంటుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: