మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో రామగుండం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది..
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన నియోజకవర్గ ఇంచార్జ్ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు బలమని బూతు స్థాయి నుండి అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తూ రాబోయే రోజుల్లో 30 సంవత్సరాల కళ రామగుండం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయలని ఈ విషయంలో ప్రతి కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Post A Comment: