ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ

 

హన్మకొండ ;

ఈ నెల 23,24,25 వ తేదీల్లో ముాడు రోజుల పాటు కాజీపేటలోని దర్గా ఉత్సవాల ఏర్పాట్ల కోసం బుధవారం  కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో  హన్మకొండ జిల్లా  కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ  కార్యక్రమంలో అన్ని విభాగాల నుండి అధికారులు హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన ప్రభుత్వ  ఛీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ  దేశవ్యాప్తంగా అన్ని దర్గాలలో  కెల్లా కాజీపేట దర్గా ప్రపంచంలోనే మూడవ అతిపెద్దదని, మన రాష్ట్రం నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు  వస్తారని, అన్ని మతాలవారు దర్గాలో దర్శనం చేసుకుంటారని అన్నారు. దర్గాకు దర్శనం కోసం 50 వేల మంది పాల్గొంటారని ,వారి సౌకర్యార్థం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను  ఆదేశించారు. ఆధ్యాత్మిక సభ ,లైటింగ్, దర్గాకు ప్రత్యేక ఏర్పాట్లు, రైల్వే ట్రాక్ నుండి దర్గా వరకు ఇరువైపులా లైటింగ్,  కాంపౌండ్ వాల్ పేయిటింగ్, వాష్ రుామ్స్ ఏర్పాటు, ఫైర్ డిపార్ట్మెంట్, బారికేడ్స్ ,పైప్స్ నుండి నీరు వృథా కాకుండా నీటి లీకేజీని అరికట్టడం, ఉత్సవాల్లో భాగంగా ప్లాస్టిక్ నివారణ కోసం ,ప్లాస్టిక్ వాడకుండా చుాడలని అన్నారు. సమావేశాన్ని  ఉద్దేశించి రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ మూడు రోజుల పాటు అన్ని విభాగాలకు చెందినటువంటి అధికారులు 24 గంటలు వారియొక్క సేవలు అందించాలని,  ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, ఆర్టీసీ, ఎన్పీడీసీఎల్  కరెంటు, ఆర్అండ్ బి,రైల్వే అధికారులు అన్ని  ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని అన్నారు.

ఈ సమావేశాన్ని ఉద్దేశించి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ కాంపౌండ్ వాల్ , శానిటేషన్, ఫాగింగ్ ,దర్గాకు లైటింగ్ ఏర్పాటు చెయ్యడమే కాకుండా  రేపటి నుండి అన్ని పనులు  చేపట్టాలని  అన్నారు. దర్గా ఉత్సవాలకు ఏర్పాట్లకు పర్యవేక్షణకు గానూ జీడబ్ల్యూఎంసీ అడిషనల్  కమిషనర్  ను  కోఆర్డినేట్ చేసుకుని అన్ని విభాగాలు పని చేయాలని అన్నారు. 

కార్యక్రమంలో అదనపు   కలెక్టర్ జి.సంధ్యారాణి ,జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అజీజ్ ఖాన్, కాజీపేట దర్గా ఉత్సవాల పీఠాధిపతి ఖూస్రు పాషా, డిఆర్ఓ  వాసు చంద్ర, వివిధ విభాగాల అధికారులు  పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: