ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
కాటారంలో జరిగిన ఒకరి హత్య కేసులో కడపకు చెందిన ఎర్రోవోల్ల హుస్సేన్ షాకు జీవిత ఖైదు విధిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా సెషన్స్ జడ్జి శ్రీ నారాయణ బాబు మంగళవారం తీర్పు ఇచ్చారు. ఈ హత్య కేసు పూర్వపరాలు ఇలా ఉన్నాయి
నేరస్తుడు ఎర్రోవోల్ల హుస్సేన్ షా, తండ్రి. బికారి, వయస్సు : 35 సం. కులం; ముస్లిం, r/o ఖానగూడూరు గ్రామం, దువ్వూరు మండలం, కడప జిల్లా, అలాగే భజంతోల్ల గుర్రప్ప తండ్రి: పాములేటి, వయస్సు: 50సం., కులం: మంగలి, r/o కొతపల్లి గ్రామం, చాగల మండలం, కర్నూల్ జిల్లా, ఇరువురు కాటా రంలో కూలీ పనులు చేస్తూ, కుటుంబాలతో జీవిస్తూ ఉండేవారు, నేరస్తుడు ఎర్రోవోల్ల హుస్సేన్ షా, యొక్క భార్య తో వివాహేతర సంబధం పెట్టుకున్నడనే అనుమానంతో తేదీ 25.02.2016 రాత్రి 10:30 గంటలకు కాటారం గ్రామంలోని చెక్ డ్యాం వద్ద, భజంతోల్ల గుర్రప్ప ను రాత్రి సమయం లో నిద్రిస్తుండగా నేరస్తుడు ఎర్రోవోల్ల హుస్సేన్ షా, తండ్రి. బికారి, వయస్సు : 35 సం. కులం; ముస్లిం, r/o ఖానగూడూరు అనునతడు కర్రతో భజంతోల్ల గుర్రప్ప తలపై బలంగా కొట్టగా, తీవ్ర రక్త గాయమై చనిపోయాడని, ఫిర్యాది ముత్తుమల్ల లింగారెడ్డి తండ్రి. రంగారెడ్డి, వయస్సు: 68 సం, కులం: రెడ్డి, r/o ఉప్పలూరు గ్రామం కడప జిల్లా అనుతడు దరఖాస్తు ఇవ్వగా, కాటారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయగా, అప్పటి సి. ఐ. సదన్ కుమార్, విచారణ చేసి కోర్టు లో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఈ కేసుపై పి.నారాయణ బాబు జిల్లా సెషన్స్ జడ్జి జయశంకర్ భూపాలపల్లి
కేసు పూర్వపరాలను విచారించి, వాదోపవాదనలు విన్న తర్వాత, ఎర్రోవోల్ల హుస్సేన్ షాకు కు జీవిత ఖైదు శిక్షను విధించడం జరిగినది. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా సమర్థవంతంగా వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జి. శివరాం, ఎ. రాములు, ఇట్టి కేసులో ఎన్ బి డబ్ల్యూ వారంట్ గా ఉన్న నేరస్థుడిని పట్టుకుని కోర్ట్ లో ప్రవేశపెట్టి అండర్ ట్రయల్ ప్రిసినర్ గా, ట్రయల్ నడిపించటానికి మరియు ట్రయల్ ను సమర్ధవంతంగా నిర్వహించి శిక్ష పడటానికి కృషి చేసిన డిఎస్పీ B.కిషన్ పి రంజిత్ రావు, సిఐ , సిహెచ్ శ్రీనివాస్, డి.సుధాకర్ కాటారం ఎస్సై లను , కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ ఏఎస్సై వెంకన్న లను జయశంకర్ భూపాలపల్లి ఎస్పి జె. సురేందర్ రెడ్డి అభినదించారు.

Post A Comment: