ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ సంధ్యా రాణితో కలసి వినయ్ భాస్కర్
గురువారం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ఏర్పాట్లు పరిశీలించారు.
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సావాలను ఘనంగా నిర్వహించాలని అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
అనంతరం కుడా చైర్మెన్ సంగం రెడ్డి సుందర్ రాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్,లతో కలిసి ర్యాలీ నిర్వహించే ప్రదేశాలు సభా వేదిక, ఆర్స్ట్ అండ్ సైన్స్ కాలేజీ, హయగ్రీవాచారీ గ్రాండ్స్ ను పరిశీలించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ వాసు చంద్ర, నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ రషీద్, ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, ఈఈ సంజయ్, ఎంహెచ్ఓ జ్ఞానేశ్వర్, స్థానిక తహీల్దార్ జి. రాజ్ కుమార్, జిల్లా అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Post A Comment: