ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఇదో గొప్ప నిర్ణయం.
తెలంగాణ నూతన సచివాలయానికి బాబాసాహెబ్ బీ.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టడం యావత్ జాతికి గర్వకారణం అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సమాజంలోని ప్రతీ ఒక్కర్నీ సమాన దృష్టితో చూసిన, దళిత, వెనుకబడిన వర్గాల సమానత్వం కోసం పోరాడిన మహనీయుడి పేరును అత్యాధునిక సచివాలయానికి పెట్టడం గొప్ప నిర్ణయం. ఈ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాం.
ఈ చర్యతో దళిత, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం మరింత పెరిగింది. ఇదే స్పూర్తితో కేంద్ర ప్రభుత్వం సైతం నూతన పార్లమెంటు భవనానికి బాబా సాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టాలని డిమాండ్ చేస్తున్నాము.

Post A Comment: