మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగిద్దాం , సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య*తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సిపిఎం ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో అన్నపూర్ణ కాలనీలో రైతాంగ సాయుధ పోరాట వారోత్సవ సభగిట్ల లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగింది, ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య మాట్లాడుతూ తెలంగాణలో దున్నేవారికి భూమి, వెట్టిచాకిరి  నుండి కోసం, నిజాం నవాబు అరాచకాలకు, భూస్వాముల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు, ఎర్రజెండా అండతో నిజాం నవాబును తరిమికొట్టిన ఘనత కమ్యూనిస్టులుగా దక్కుతుందని అన్నారు, పది లక్షల ఎకరాల భూమి నిరుపేదలకు పంచి, 3000 గ్రామాలను భూస్వాముల నిరంకుశ పాల నుండి విముక్తి  చేయడం జరిగిందనీ 4000 మంది కమ్యూనిస్టు లు ప్రాణ త్యాగాలు చేసినిజాం పాలనకు చమర గీతం పాడారని అన్నారు ,పోరాటంలో హిందూ ముస్లింలు ఐక్యంగా పోరాటం చేశారని ముఖదోం మొయినొద్దీన్, షేక్ బందగి, సోయబుల్లాఖాన్ అమరులయ్యారని, విసునూర్ దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి, జన్నారం ప్రతాపరెడ్డి తదితర జమీందారుల దౌర్జన్యాలను ఎదిరించి భీమ్ రెడ్డి నరసింహారెడ్డి, దొడ్డి కొమరయ్య, వీరనారి ఐలమ్మ లాంటి ఎందరో మహానుభావులు పోరాటం చేశారని అన్నారు కానీనేడు బిజెపి, ఆర్ఎస్ఎస్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరించి వక్రీకరించి ప్రజలను తప్పుదారి పట్టించే పని చేస్తుందని దేశభక్తి ముసుగులోవిద్రోహనికి పాల్పడుతున్నారు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వాస్తవాలను ప్రజల్లోకి  తీసుకెళ్లాలని, బీజేపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎం రామాచారి, జిల్లా కమిటీ సభ్యులు నాంసనీ శంకర్, సారయ్య, గిట్ల లక్ష్మారెడ్డి, ఏ నర్సింగరావు, ఎండి యాకుభ్, పి సునీత, వి శ్రీనివాస్ రెడ్డి, టి రవీందర్, ఎం కృష్ణారెడ్డి, డీ., రాఘవరెడ్డి, ఏం సాంబయ్య, గౌర క్క శ్రీనివాస్, సదానందం, పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: