ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో బాగంగా రెండవ రోజు 12 వ డివిజన్ దేశాయిపేటలో కార్పోరేటర్ కావటి కవిత రాజుయాదవ్ తో కలిసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రతీ వీది కలియదిరుగుతూ లబ్ధిదారుల ఇండ్లకు వెల్లి కొత్త పించన్ల ను అందజేసారు. ఎమ్మెల్యేనే స్వయంగా తమ ఇండ్లకు వచ్చి పించన్ అందజేయడంతో లబ్దిదారులు సంతోషాన్ని వ్యక్తం చేసారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ కొత్త పించన్లతో వృద్దులు, దివ్యాంగులు, వితంతువులు,ఒంటరి మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారన్నారు. పేదల
గుండె ధైర్యం కేసీఆరని, ప్రజల కష్టాలు తీర్చడమే ఎజెండాగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post A Comment: