ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ; 

జిల్లాలో రహదారి ప్రమాదాలు తగ్గించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని సీపీ తరుణ్ జోషి అన్నారు.

శుక్రవారం  హనుమకొండ కలెక్టరేట్‌ సమావేశమందిరంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేనికి హనుమకొండ, వరంగల్ కలెకర్లు  రాజీవ్ గాంధీ హనుమంతు, గోపీ, ఉన్నత అధికారులు హాజరైయ్యారు.  అధికారులు ఉమ్మడి జిల్లా లో రోడ్డు భద్రత  పై  పవర్  పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతిరోజు  ఉమ్మడి జిల్లాలో అనేక ప్రదేశాలలో రహదారి ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రజలలో ట్రాఫిక్‌ నియమాలపై అవగాహాన కల్పించడం ద్వారా ప్రమాదాల నివారణకు సంబందిత శాఖలు కృషి చేయాలని కోరారు.

ప్రజల ప్రాణరక్షణే ధ్యేయంగా నిబంధనలను నిర్మొహమాటంగా, నిష్కర్షగా అమలుచేసి, అతిక్రమణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు .  ప్రమాదాల నివారణకు జిల్లాలోని ప్రధాన రహదారులను మరింత సురక్షితంగా తీర్చిదిద్దాలని, రహదారి భద్రతపై మరింత అవగాహనను ప్రజలకు పెంపొందించాలని కోరారు. ప్రభుత్వ అధికారులు  రోడ్డు భద్రతా  నియమాలు  ఖచ్చితంగా పాటించి   ప్రజలకు  ఆదర్శo గా ఉండాలి  అని అన్నారు.ప్రత్యేకించి ద్విచక్రవాహన దారులు తప్పని సరిగా హెల్మెట్‌ వాడాలని, లేన్‌ క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ద్విచక్రవాహనదారులు తమ లేన్‌లో వెళ్లకుండా అడ్డదిడ్డంగా ప్రయాణించినప్పుడు ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. సబర్బన్‌ ఏరియా నుంచి నగరంలోకి వచ్చే ద్విచక్రవాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని కోరారు.

 డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ నియంత్రణకు బ్రీత్ ఎనలైజర్లు, స్పీడ్ గన్‌లను ఎక్కువ సంఖ్యలో వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ప్రమాదాలు జరగకుండా హనుమకొండ  వరంగల్ జిల్లా లో పది  ప్రాంతాలలో రోడ్లు ను విస్తరించాల్సిన అవశ్యకత  ఉందని  అన్నారు.

హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలో14బ్లాక్ స్పాట్లు10వరంగల్ జిల్లా లో బ్లాక్ స్పాట్ల ను అధికారులు గుర్తించారు అని అన్నారు.  హనుమకొండ జిల్లా లో 2021 సంవత్సరo లో241 మంది  క్షటాగాత్రులు106 మంది  రోడ్డు ప్రమాదల  బారిన  పడి  మరణించరాని,2022 సంవత్సరం లో ఇప్పటి వరకు270మంది క్షటాగాత్రులు అయ్యారు110 రోడ్డు ప్రమాదం మరణించారని రోడ్డు ప్రమాదాలసంఖ్య  పెరగడం పై  ఆందోళన వ్యక్తం చేసారు.

రహదారి నిర్మాణంలో  ఏమైనా ఇంజినీరింగ్‌ పరమైన లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రమాదకరమైన యూ-టర్న్‌లను మూసేయాలని సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న జాతీయ రహదారులను రెగ్యులర్‌గా తనిఖీ చేస్తూ ఉండాలన్నారు. ఇటీవల కురిసిన భారీ  వర్షాలకు దెబ్బ తిన్న రోడ్లను సత్వరమే  పునరిద్దరించాలని  అన్నారు

ఈ  కార్యక్రమం లో అదనపు కలెక్టర్లు  సంధ్యా  రాణి, శ్రీ వాత్సవ్ జిల్లా న్యాయధికారి సంస్థ సెక్రటరీ ఉపేందర్ రావు,మున్సిపల్, రెవిన్యూ, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: