మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడంలో సింగరేణి యాజమాన్యం తెరాస ప్రభుత్వం విఫలం అయిందని-- కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్*అన్నారు
*పెద్దపెల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత తొమ్మిది రోజులుగా చేస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిర్వహించిన ధర్నా లో హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేల జీతాలు పెంచి భారతదేశంలోని అత్యధిక జీతం తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిని తన సొంత పనుల కోసం ప్రభుత్వాన్ని నడపడం కోసం సింగరేణి సంస్థ యొక్క నిధులను వాడుకుంటూ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్న కాంట్రాక్టు కార్మికుల విషయంలో అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతూ దొరల పాలన కొనసాగిస్తున్న కేసీఆర్కు ప్రజాక్షేత్రంలో సబ్బండ వర్గాలు తగిన బుద్ధి చెప్పాలని కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లు సాధించేవరకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రత్యక్షంగా ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులతో పాటు జేఏసీ నాయకులు పాల్గొన్నారు

Post A Comment: