ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
సన్నూరు- వెంకటేశ్వరపల్లి లోని చారిత్రాత్మక స్వయం వ్యక్త శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణం, ఆధునీకరణకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 కోట్ల నిధుల వినియోగం పై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం వరంగల్ కలెక్టరేట్ లోని సమావేశ మందిరం లో సమీక్షించారు.
సీఎం కెసిఆర్ కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి, ఆయా నిధులతో చేపట్టాల్సిన వివిధ పనులను ఆయన ఆయా శాఖల అధికారులతో చర్చించారు. త్వరలోనే పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని మంత్రి జిల్లా కలెక్టర్ గోపి ని అదేశించారు.
సన్నూరు శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రధాన గర్భగుడి ఎదురుగా ధ్వజస్తంభం సమీపంలో మహా మండపం ఏర్పాటు, బ్రహ్మోత్సవాల నిర్వహణకు చుట్టు ప్రాకారం మాడవీధుల ఏర్పాటు, కొత్తగా పుష్కరణ ఏర్పాటు, శివాలయం నిర్మాణం, ప్రధాన ఆలయంలో మార్పులు చేర్పులు విగ్రహ ప్రతిష్టాపనలు, ఉత్సవ విగ్రహాల ఏర్పాటు, హనుమంతుడు గరత్మంతుడు ఆలయ ఏర్పాటు, వెంకటేశ్వర చౌరస్తా లో శ్రీరామానుజుల వారి సమతా విగ్రహం ఏర్పాటు, భక్తులకు వసతులు పచ్చదనం కోసం గార్డెన్ ఏర్పాటు, వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి నుండి దేవాలయం వరకు రోడ్డు అభివృద్ధి, తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా కళ్యాణ మండపం ఏర్పాటు వంటి పలు అంశాల మీద మంత్రి సంబంధిత అధికారులతో చర్చించారు.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు- వెంకటేశ్వరపల్లి లోని చారిత్రాత్మక స్వయం వ్యక్త శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణం, ఆధునీకరణకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 11 న సీఎం కెసిఆర్ జనగామ జిల్లా సమస్త కార్యాలయాల సమగ్ర జిల్లా కలెక్టరేట్ ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇచ్చిన విజ్ఞాపన, సీఎం ఇచ్చిన హామీ మేరకు ఈ నిధులను విడుదల చేశారు. ఆయా శాఖల ద్వారా ఆయా పనులను చేపట్టాలని ఆ ఆదేశాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని రాయపర్తి మండలం సన్నూరు- వెంకటేశ్వరపల్లి లోని చారిత్రాత్మక స్వయం వ్యక్త శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయ ఎంతో మహిమాన్వితమైనది. భక్తుల కోరిక లు తీర్చే కొంగుబంగారం. ఇలాంటి దేవయం జీర్ణోద్ధరణ కు, పునర్నిర్మాణం, ఆధునీకరణకు సీఎం గారిని కోరిన వెంటనే, సానుకూలంగా స్పందించి, రూ.10 కోట్ల నిధులు విడుదల చేశారని, ఇది సీఎం గారి గొప్ప హృదయానికి, అభివృద్ధి కాముకతకు నిదర్శనమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కెసిఆర్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ఆ దేవాలయంలో అభివృద్ధి పనులను మొదలు పెట్టి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని మంత్రి అన్నారు.

Post A Comment: