చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
అన్నదానం మహాదానం అని ఆకలితో
ఉన్న పేదవారికి పట్టెడు అన్నం తో కడుపు నింపడం పుణ్య కార్యంఅని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
అన్నారు. గణేష్ శరన్నవరాత్రిఉత్సవములలో భాగంగా
చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని 13 వ వార్డు శ్రీ కృష్ణా నగర్ కాలనీలోని గణపతి మండపంలో ఆదివారం మునుగోడు మాజీ
ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్వామి వారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం గణపతి ఉత్సవ కమిటీ
ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న దాన కార్యక్రమంప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు గుండె
బోయిన మల్లేశం యాదవ్, ఏ ఎం సి చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ సుల్తాన్ రాజు, కొరగోని లింగస్వా మి, మున్సిపల్
అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్, యువజన సంఘం అధ్యక్షుడుతోర్పునూరీ నరసింహ గౌడ్, రెడ్డి, నాయకులు తాడూరిపరమేష్, పెద్దగొని లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: