ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ నగర పాలక సంస్థ పరిధి లోని 33 వ డివిజన్ లో ఐసిడిఎస్ వరంగల్ ప్రాజెక్ట్ సీడీపీఓ విశ్వజ అధ్యక్షతన పోషణ మాసం కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.
గర్భిణిలుగా ఉన్నప్పటినుండి బిడ్డపుట్టే వరకు,బిడ్డకు 5 సంవత్సరాలు వచ్చేవరకు గర్భిణిలు,పిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటూ వారి పోషణ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహిస్తున్న అంగన్ వాడి టీచర్లు, సిబ్బంది కృషి అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ ముష్కమల్ల అరుణ సుధాకర్,సూపర్ వైజర్లు బత్తిని రమాదేవి, సృజన,రాజు,డివిజన్ అధ్యక్షులు మేరిపల్లి వినయ్,మోడెం ప్రవీణ్,బైరి ప్రతాప్, మండ శ్యాం, వంగరి శ్రీనివాస్, సంతోష్, ఉపేంద్ర, అంగన్ వాడి కేంద్ర కమిటి సభ్యులు,అంగన్ వాడి టీచర్లు,ఆయాలు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Post A Comment: