ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లా, హసన్ పర్తి మండలం, ఎర్రగట్టులో తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్ ను అదనపు కలెక్టర్ సంధ్యా రాణీ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు.
పాఠశాల ఆవరణలో కిచెన్ షేడ్, డైనింగ్ హాల్, స్టోర్ రూం, క్లాస్ రూం, మరుగు దొడ్లు,ను పరిశీలించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని త్రాగు నీరు, విద్యుత్ సరఫరా, తదితర అంశాలపై సిబ్బందికి సూచనలిచ్చారు.
విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతు భోజనం ఎలా ఉంది, సిలబస్ ప్రకారం క్లాసులు జరుగుతున్నాయా తదితర అంశాలపై విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్స్ పాల్ కె. అశోక్ రెడ్డి, సిబ్బంది నాగతులసి, శ్వేత, కమల, క్రిష్ణ వేణి, తదితరులున్నారు.


Post A Comment: