ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వచ్చే నెల 16వ తేదీన నిర్వహించే గ్రూప్ 1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని టిఎస్పిఎస్సి కార్యదర్శి జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలను అన్ని విధాల సిద్ధం చేయాలన్నారు. కేంద్రాల్లో అవసరమైన తాగునీటి వసతి కల్పించాలని విద్యుత్ సౌకర్యంతో పాటు అవసరమైన ఇతర అన్ని రకాల వసతులు కల్పించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ హనుమకొండ జిల్లా లో 53 సెంటర్లు, 21వేల 31 మంది విద్యార్థులు, గ్రూప్ 1 పరీక్ష రాస్తున్నారు అని అన్నారు. ఇందుకు సంబంధించిన, స్కూల్స్, కాలేజీ ప్రిన్సిపాల్స్ తో సమన్వయ సమావేశం నిర్వహిస్తామని వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ సంధ్యా రాణీ, డిఆర్ఓ వాసు చంద్ర, కలెక్టరేట్ పరిపాలన అధికారి కిరణ్ ప్రకాశ్, తదితరులున్నారు.

Post A Comment: