మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్ టి పి సి కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న కార్మిక అన్నలకు మద్దతుగా ఈరోజు జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని వారి హక్కులు సాధించేవరకు ఏ పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని రామగుండం ప్రజల ఆత్మగౌరవం నిలబడే విధంగా ఎన్టిపిసి యాజమాన్యం బహిరంగ క్షమాపణ చెప్పే వరకు న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు కలిసికట్టుగా ఐక్యమత్యంగా పోరాడుదాం అని పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు సహకారంతో రామగుండం నియోజకవర్గకాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రాజ్ ఠాకూర్ సహకారంతో కార్మికుల హక్కుల సాధన కోసం మా వంతు పాత్ర పోషిస్తామని స్పష్టం చేశాం ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కౌశిక్ హరి మాజీ ఎమ్మెల్యే సోమారం సత్యనారాయణ డిప్యూటీ మేయర్ అభిషేక రావు యాకయ్య రామాచారి తో పాటు యూత్ కాంగ్రెస్ నాయకులు వెంచర్ల మహేష్ ఎన్ ఎస్ యు ఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్ వంశీ తదితరులు పాల్గొన్నారు

Post A Comment: