మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని-; సీఎం కెసిఆర్ పెద్దపల్లికి వస్తున్న నేపధ్యంలో ముందస్తుగా కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రామగుండం సింగరేణి కార్మికులు ఎన్నిసార్లు బ్లాస్టింగ్ లో చనిపోయినప్పుడు , 800 మంది ఆర్ ఎఫ్ సి ఎల్ కార్మికుల డబ్బు 45 కోట్లు వసూలు చేసిన టిఆర్ఎస్ నాయకుల చేసిన దోపిడి కి అన్యాయంగా ముంజ హరీష్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్న అనేక ప్రజా సమస్యల పట్ల మాట్లాడిన సీఎం, ntpc మూడు వేల మంది కాంట్రాక్టు కార్మికులు, B పవర్ హౌస్ కార్మికులు, మా నీళ్ళు మాకు కావాలని రైతులు,నిరుద్యోగులు అడ్డుకుంటారని భయంతో ముందస్తుగా అరెస్టు చేసి,ప్రజా సమస్యలు ఉన్నప్పుడు రాని ముఖ్యమంత్రి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి వస్తున్నందుకు ఎంతటి దుర్మార్గమైన పాలన టిఆర్ఎస్ ప్రభుత్వనిది అని రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తీవ్రంగా ఖండించారు.

Post A Comment: