ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
కానిస్టేబుల్ రాత పరీక్షకు మొత్తం 4755 మందికి గాను, 4428 మంది హాజరు, 327 మంది అభ్యర్థులు గైరాహాజరు అయ్యారు.
జిల్లా పరిధిలోని కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ జె. సురేందర్ రెడ్డి పరిశీలించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో ఆదివారం నిర్వహించిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష సజావుగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాత పరీక్ష నిర్వహించగా, జిల్లాలోని 17 పరీక్షా కేంద్రాలను ఎస్పి జె. సురేందర్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించి, పోలీసు అధికారుల నుండి ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష పోలీసు నోడల్ అధికారి అడిషనల్ ఎస్పి వి. శ్రీనివాసులు, రీజినల్ కో-ఆర్డినేటర్ MS మూర్తి, చీప్ సూపర్డెంట్లు, అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్లు, పోలీస్ అధికారులు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

Post A Comment: