ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని పలువురు అనారోగ్యంతో బాధపడుతూ ఆర్ధికంగా చేతికలబడిన విషయం తెలుసుకుని వారికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి ఆర్ధిక సహాయాన్ని మంజూరు చేయించి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ శనివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
చెక్కుల పంపిణీ అనంతరం చీఫ్ విప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపిస్తున్నారని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మందికి ఇప్పటికే ముఖ్యమంత్రి సహయనిధి నుండి సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే కోట్లాది రూపాయలను సీఎం సహయనిధి నుండి అందివ్వడం జరిగింది. ఇకపై కూడా ఎక్కువ మొత్తంలో అందిస్తామన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలు స్థానిక నాయకుల ద్వారా మా దృష్టికి తీసుకువస్తే వారికి అండగా ఉంటాం. దాదాపు 11 మంది లబ్ధిదారులకు పదమూడు లక్షల డెబ్భై రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు , లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: