ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ
మహనీయుల త్యాగాలను స్మరించుకునెందుకే రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు స్వతంత్ర్య భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నదని రాష్ట్ర
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవం ద్విసప్తాహ వేడుకలలో భాగంగా శనివారం వరంగల్ మహా నగరపాలక సంస్థ ఆవరణలో వజ్రోత్సవాల జ్ఞాపకార్ధం జిడబ్లుఎంసి ప్రాంగణంలో రూ.10.20 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన అశోక స్థూపాన్ని మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీలను మంత్రి ప్రారంభించి, మెప్మా, ఐసిడిఎస్ లకు చెందిన 150 మంది మహిళలు వేసిన ముగ్గులను మంత్రి పరిశీలించారు. స్వయంగా మంత్రి ఎర్రబెల్లి ముగ్గులు వేశారు. వేసిన కొన్ని ముగ్గులకు రంగులు అద్దారు. మంత్రితో పాటు కమిషనర్ ప్రావీణ్య కూడా ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ , వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యే నరేందర్, డిప్యూటీ మేయర్ రీజ్వాన శమీమ్ మసూద్, పలువురు కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, బల్దియా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జి.డబ్ల్యు.
.ఎం.సి. కమిషనర్ పి. ప్రావీణ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ప్రతి ఇంటా జెండా ఎగరవేయడం తో పాటు స్వతంత్ర పోరాటం లోని మహనీయుల త్యాగాలను స్మరించుకునే విధంగా పదిహేను రోజుల పాటు రోజుకో కార్యక్రమాన్ని నిర్వహించి స్వాతంత్య్ర స్ఫూర్తిని, దేశభక్తి, సమైక్యతా భావం, ప్రతి ఒక్కరిలో కలిగేలా ఈ ఉత్సవాలను నగరంతో పాటు ప్రతి మండలం, గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు.
అహింసా మార్గంలో ఆనాడు గాంధీజీ, నెహ్రూ, సర్ధార్ వల్లభాయి పటేల్ సాధించిన భారత స్వతంత్రాన్ని స్ఫూర్తిగా తీసుకొని అహింసా మార్గంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కెసిఆర్ కు దక్కుతుందన్నారు. సీఎం కెసిఆర్ నేతృత్వంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో ముందు ఉందన్నారు.
మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లాల ద్వారా తాగునీరు అందించడంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ అని కేంద్ర ప్రభుత్వం అనేక అవార్డ్ లు ఇచ్చిందన్నారు.
ఉపాధి హామీ పథకంలో దేశంలోనే అధిక పని దినాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్,
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ప్రపంచంలోనే అద్భుతమైన నెంబర్ వన్ ప్రాజెక్ట్ అని కేంద్రం కితాబిచ్చిన అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తున్నది కానీ నిధులు మంజూరు చేయడం లేదన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పురపాలక శాఖ మాత్యులు కేటిఆర్ దిశానిర్దేశం లో
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సాధిస్తు దేశంలోనే నంబర్ వన్ గా ఉందన్నారు.
రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వరంగల్ మహానగర అభివృద్ధి కి పాటుపడాలని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
అయితే రంగురంగుల ముగ్గులు కూడా సృజనాత్మక కళ గా మంత్రి పేర్కొన్నారు. ముగ్గులు వేసిన మహిళలను మంత్రి అభినందించారు.
రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ఆనాటి మహనీయుల స్ఫూర్తిని కళ్లారా చూడకున్నా, చెవులారా విని అనేక ప్రసార మాధ్యమాల ద్వారా వారి త్యాగానికి స్ఫూర్తిని పొంది ఆనాటి త్యాగధనుల స్ఫూర్తి ని చూసి మరోసారి దేశభక్తి కోసం వారి త్యాగాల ఫలితం గానే నేడు స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామని అన్నారు. దేశభక్తి నింపే విధంగా రాబోయే తరాలకు తెలిసే విధంగా ద్విసప్తాహ ఉత్సవాలను
నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో శాంతికి చిహ్నమైన అశోక చక్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవాల్లో భాగంగా దాదాపు బల్దియా పరిధిలోని రెండు లక్షల గృహాలకు ఇంటింటా జెండాలు అందజేసి ఎగరవేయడం లో భాగస్వాములైన కార్పొరేటర్లకు కమిషనర్ బల్దియా సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ నగరంపై ముఖ్యంగా జి డబ్ల్యూ ఎం సి పి పై ప్రత్యేక శ్రద్ధ వహించి అధిక నిధులు కేటాయించడం, పురపాలక శాఖ మాత్యులు కేటీఆర్ సహకారంతో మహానగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళుతున్నట్లు తెలిపారు.
అనంతరం వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీలు రంగోలి మరియు ఉత్తమ సేవలు అందించిన బల్దియా ఉద్యోగులకు మంత్రి దయాకరరావు, చీఫ్ విప్ వినాయభాస్కర్, మేయర్ సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య, కార్పొరేటర్ల చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని, జ్ఞాపిక లను అందజేశారు. ఈ కార్యక్రమంలో బల్దియా అడిషనల్ కమిషనర్ రషీద్, సెక్రెటరీ లక్ష్మి, ఉప కమిషనర్ లు, మెప్మా పిడి బల్దియా అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది మెప్మా, ఆర్ పి లు, సి వో లు, ఐసిడిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కన్న కలలైన భారత రాజ్యాంగంలో పొందుపరచిన విద్యా వైద్యం సమానత్వాన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తూ అన్ని వర్గాల వారికి నాణ్యమైన విద్య అందిస్తున్నారని తెలిపారు.
Post A Comment: