చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపల్
పరిధిలోని లింగారెడ్డిగూడెంలోని జిఎన్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో గురువారం
బిజెపి మండల, మున్సిపల్ ప్రత్యేక సమావేశం గురువారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి
రాజగోపాల్ రెడ్డి ని పోలోజు అనిల్ చారి గజమాలతో, శాలువాతో ఘనంగా
సన్మానించారు అనంతరం పోలోజు అనిల్ కుమార్ చారి ఆధ్వర్యంలో తంగడపల్లి గ్రామానికి చెందిన సుమారు 100మంది యువకులు, వివిధ పార్టీనాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో బిజెపి పార్టీలో చేరారు. పార్టీలోచేరిన వారికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువాలను కప్పి
పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో నగేష్ లింగస్వామి, బండిరాజు, భైరు సాయి, శ్రీకాంత్, శ్యామల అనిల్, చంటి, గట్టు గణేష్, కొలుకులపల్లి బుచ్చయ్య, చింతల రాజు తదితరులు ఉన్నారు.

Post A Comment: