చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో గల పాలకూర్లశివయ్య గౌడ్ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో, చౌటుప్పల్కు చెందిన 30మంది గర్భిణీ స్త్రీలకు గురువారం సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిహెచ్
చంద్రశేఖర్, ప్రభుత్వ వైద్యురాలు సుభాషిని లు హాజరై, మాట్లాడుతూ రక్తహీనత రాకుండా గర్భిణీలుతగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గర్భిణిలు ప్రభుత్వ ఆసుపత్రి లో సాధారణ ప్రసవాల
కోసం ఇప్పటి నుండి తగిన ఆహార జాగ్రతలు తీసుకోవాలన్నారు. మాతా శిశువుల మరణాలు తగ్గించాలని అంగన్ వాడీ సెంటర్లు ఆరోగ్య లక్ష్మికీ హాజరై అనుబంధ ఆహారం తీసుకోవాలన్నారు. ప్రతిగర్భిణి 4కిలోల శిశువు ప్రసవించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో సూపర్వైజర్ శోభ, సీనియర్వైద్యుడు చలపతి రెడ్డి, ఫౌండేషన్ నిర్వహుకురాలు పాలకూర్ల భాను,అంగన్వాడి టీచర్లు, సఫియ,
సుజాత, నజీమున్నీసా, చంద్రకళ, జ్యోతి, నిర్మల, ఫౌండేషన్ సభ్యులు సోని, గౌతమి పాల్గొన్నారు.

Post A Comment: