మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్టీపీసీ లో నిరసన చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పై సిఐఎస్ఎఫ్ సిబ్బంది దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి భూపాల్ తెలిపారుఎన్టిపిసి సిఐఎస్ఎఫ్ సిబ్బంది దాడిలో గాయపడిన కార్మికులు వెంకట స్వామి, పెద్దులు, మేకల లింగయ్య, దుర్గయ్య, కంది నాగరాజు లను పరామర్శించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రామగుండం ఎన్టీపీసీ లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని, 2018 లో కాంట్రాక్టు కార్మికులతో ఎన్టీపీసీ యాజమాన్యం చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎన్టీపీసీ ప్లాంట్ గేట్ నెంబర్ 2 వద్ద జరిగిన నిరసన లో కాంట్రాక్టు కార్మికులపై, కార్మిక సంఘాల నాయకులపై అకారణంగా సిఐఎస్ఎఫ్ సిబ్బందిచే ఎన్టీపీసీ యాజమాన్యం లాఠీ చార్జి చేయించి, విచక్షణా రహితంగా రక్తాలు కారేవిధంగా దాడులు చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.
లాఠీ చార్జి లో గాయపడ్డ జేఏసీ కార్మిక సంఘాల నాయకులకు, కాంట్రాక్టు కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని, మరియు వారికి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని,కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని, లాఠీ చార్జి కి పాల్పడ్డ సిఐఎస్ఎఫ్ సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులు చేసే పోరాటానికి సీఐటీయూ రాష్ట్ర కమిటి తరపున సంపూర్ణ మద్దతు తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో యూనియన్ నాయకులు నాంసాని శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, ఏం రామాచారి, కే పురుషోత్తం, దండ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: