మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై పరిష్కారం అయ్యే వరకు పోరాడుదామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. బుధవారం ఎన్టీపీసి లెబర్ గెట్ నుండి FCI క్రాస్ రోడ్దు వరకు జేఏసీ ర్యాలీ పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడారు.
రాజకీయ జెండాలకు పక్కనపెట్టి ఎన్టిపిసి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై పోరాడుదామన్నారు. గతంలో ఒప్పందం చేసుకున్న కాంట్రాక్ట్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని నిరసన చేస్తూ కార్మికులపై యాజమాన్యం విచక్షణ రహితంగా సిఐఎస్ఎఫ్ సిబ్బందితో లాఠీ ఛార్జి చేయడంతో వందల సంఖ్యలో కార్మికులకు గాయాల పాలయ్యారు. ఎన్ టి పి సి యాజమాన్యం త్వరగతినా సమస్య పరిష్కరించకుంటే శుక్రవారం నుండి కార్మికులు కార్యక్రమంలో పాల్గొని యాజమాన్యం దిగచ్చేవరకు పోరాటాలకు సిద్ధంగా ఉండాలన్నారు. అలాగే కార్మికుల సమస్య పరిష్కారం కోసం రాజకీయ పార్టీలకతీతంగా జెండాలను పక్కనపెట్టి అందరం కలిసి కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏకధాటిగా ముందుకు పోదామని పిలుపునిచ్చారు.

Post A Comment: