మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


జేఏసీ కార్మిక సంఘాల నాయకులను ఎంతమందిని  అక్రమంగా అరెస్టు చేసిన ఎన్టిపిసి కాంట్రాక్ట్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ లు పరిష్కారం అయ్యేంత వరకు తమ పోరాటం ఆగదని ఎన్టిపిసి జేఏసీ కార్మిక సంఘాల నాయకులు తెలియజేశారు.

ఈరోజు ఎన్టిపిసి ప్లాంట్ గేట్ నెంబర్ 2 వద్ద కార్మికులు జేఏసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తమ హక్కుల కోసం నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు.

  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జేఏసీ కార్మిక సంఘాల నాయకులు నాంసాని శంకర్, చిలుక శంకర్ లను ఈరోజు ఉదయం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారని,  కార్మిక నాయకుల్ని అరెస్టు చేసి, కార్మికులను భయభ్రాంతులకు గురి చేసే విధానాన్ని ఎన్టిపిసి యాజమాన్యం మానుకోవాలని,కాంట్రాక్ట్ కార్మికుల తమ న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తామని, యాజమాన్యం దిగివచ్చి లాఠి చార్జి చేసిన సి ఐ ఎస్ ఎఫ్ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని, దీనికి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని, అలాగే గతంలో చేసుకున్న పెండింగ్లో ఉన్న మూడు డిమాండ్లను పరిష్కరించాలని, కార్మికుల అసహనాన్ని పరీక్షించవద్దని, వెంటనే పరిష్కరించని ఎడల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ఎన్టిపిసి యాజమాన్యాన్ని హెచ్చరించారు.

ఈ  నిరసన కార్యక్రమంలో జేఏసీ కార్మిక సంఘాల నాయకులు సిఐటియు ఎం రామాచారి, గిట్ల లక్ష్మారెడ్డి, దండ రాఘవరెడ్డి , ఐ ఎఫ్ టి యు ఐ కృష్ణ, నరేష్, బుచ్చన్న, సిపిఐ నాయకులు గౌతమ్ గోవర్ధన్,గోదావరి యూనియన్  రాజమల్లు,హెచ్ఎంఎస్ నాయకులు డి సత్యం, టిఆర్ఎస్ నాయకులు ఈ భూమయ్య, సిహెచ్ సత్యం, బిఎంఎస్ నాయకులు టీ శ్రీనివాస్, ఏఐటీయుసీ నాయకులు శంకర్, ఆర్ లక్ష్మణ్ ఐఎఫ్టియు నాయకులు నాగభూషణం, టిన్టీయూసీ నాయకులు ఏ శ్రీనివాస్, మరియు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొ న్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: