మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
: కొట్టడానికే నీ దగ్గర గులాబీ దళాలు ఉన్నాయా...? అని రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. ఈ మేరకు దుర్గ నగర్ లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వేస్తే ఎవరికీ బాడిత పూజ చేస్తారు... ప్రశ్నించినా...వారినా...ప్రజాలనా...అని ఆయన ప్రశ్నించారు... ఎమ్మెల్యే బెదిరింపులకు భయపడేది లేదని హెచ్చరించారు. తెలంగాణలో గడిలా పాలన నడుస్తుందని నిర్భందలు.. పోలీసుల ప్రహారలో సభలు నిర్వహిస్తున్నారని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రజా సంఘాల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి బ్రిటిష్ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఆర్ ఎఫ్ సీ ఎల్ లో జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఎమ్మెల్యే అనుచరులే డబ్బులు తీసుకొని ఇవ్వడం లేదని హరీష్ అనే యువకుడు సోషల్ మీడియాలో లేటర్ రాసి చనిపోయిన దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.అలాగే మృతుడి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. హరీష్ మృతికి బాధ్యత వహించి ఎమ్మెల్యేను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే హరీష్ అనే యువకుడు మృతి చెందాడన్న విషయం ఇంటలిజెన్స్ ద్వారా తెలుసుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్ ఎఫ్ సీ ఎల్ బాధితులతో సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే కొత్త నాటకాలకు తెరతిస్తున్నారని విమర్శించారు. పెద్దపల్లి జిల్లాలో చనిపోయిన హరీష్ మృతదేహాన్ని హడావిడిగా కరీంనగర్ కు తరలించి పోస్టుమార్టం చేయవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అలాగే ముఖ్యమంత్రి వస్తే ఎందుకు ముందస్తు అరెస్టులు చేస్తున్నారని అన్నారు. ఆర్ ఎఫ్ సీ ఎల్ ఉద్యోగ దంధాలో ఎమ్మెల్యే బిజినెస్ మిత్రులే ఉన్నారని అంతేకాకుండా శ్రీనివాస్ అనే వ్యక్తిని తప్పించి ఆయన స్థానంలో తమ్ముడిని ఇరికించారని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రభుత్వ భవనమని అక్కడికి ప్రజలు ప్రజా సమస్యల కోసం వస్తుంటారని ప్రజల కోసం ఏర్పాటైన ఎమ్మెల్యే ప్రభుత్వ భవనానికి వచ్చే హక్కు ఎవరికైనా ఉంటుందని అన్నారు. కొట్టడానికి నీ దగ్గర గులాబీ దళాలు ఉన్నాయని బెదిరింపులకు భయపడేది లేదని.ఒకరి పోరాటం వల్ల కాదని ప్రతి ఒక్కరూ పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చిందని అన్నారు. ఎమ్మెల్యే బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ మహంకాళి పిసిసి కార్యదర్శి ప్రకాష్ , కార్పొరేటర్ ముస్తఫా , నగునురి రాజు, మైనారిటీ ప్రెసిడెంట్ ఖాజా నజీంముద్దిన్ , యూత్ కాంగ్రెస్ నాజీముద్దున్, కౌటం సతీష్, కో ఆర్డినేటర్ గాదె సుధాకర్,ఈదునూరి హరిప్రసాద్ ,అరుకుటి రాజమల్లు యాదవ్, మడ్డి తిరుపతి,సింగం కిరణ్ కుమార్ గౌడ్ ఎండి గౌస్ బాబా, తదితరులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Post A Comment: