ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
న్మకొండ ;
75 వ స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా హన్మకొండ బాలసముద్రంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో మానసిక వికలాంగులకు తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ , కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజు యాదవ్ , కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ముందుగా మల్లికాంబ మనోవికాస కేంద్రంలో బెలుాన్ లు ఎగరవేసి, మొక్కలు నాటారు. అనంతరం మానసిక వికలాంగులకు స్వీట్లు,పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఈ మనో వికాస కేంద్రాన్ని చూస్తే చాలా బాధగా అనిపిస్తుందని,ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేసేందుకు చాలామంది ముందుకు వచ్చారని అన్నారు.ఇన్ని సంవత్సరాలుగా ఎంతో శ్రమకొర్చి, అనుభవంతో ఎక్కడా లేని విధంగా మనో వికాస కేంద్రాన్ని నడుపుతున్నారని, ఒకరికి సేవ చేస్తే ఆనందం కలుగుతుందని, ఈ కేంద్రంలో అనాధలు, మనోవికాస మానసిక వికలాంగులు చాలామంది ఉన్నారని అన్నారు. తెలంగాణ కోసం కెసిఆర్ ఎంతో పోరాటం చేశారని అన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా మన రాష్ట్రంలో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని ఆగష్టు 8 నుండి ఆగష్టు 22 వరకు అనేక కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తుందని అన్నారు. ప్రతి ఇంటా జెండా కార్యక్రమం చేపట్టడం ,మొక్కలు నాటడం ,రక్తదానం వంటివి చేపడుతున్నారని అన్నారు. అలాగే మనోవికాస కేంద్రానికి ఏం వనరులు కావాలో వారిని అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాలుగా అభివృద్ధి చెయ్యడానికి స్థానిక ఎమ్మెల్యే, నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. యువతి,యువకులకు, చిన్నారులకు , వృద్ధులను మొదలుకొని ఈ వజ్రోత్సవ వేడుకల్లో తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్య్ర స్పూర్తిని కొనసాగిద్దామని అన్నారు.ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిధి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ 21 సంవత్సరాల నుండి వందలాది మందిని చేరదీసి వారిలో అప్యాయత, అనురాగాలను పంచుతూ కన్నబిడ్డల్లాగా సాకుతున్న మనో వికాస కేంద్రం నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే మానసిక దివ్యాంగులు జాతీయ గీతం పై చేసిన నృత్యం చాలా బాగుందని,వారికి నేర్పించిన అధ్యాపకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్ రాజు యాదవ్ ,కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి ,ఆర్డీవో వాసుచంద్ర ,జిల్లా సంక్షేమ అధికారి ఎం.సబిత, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ అన్నమనేని అనిల్ చందర్ రావు,సిడిపివో లు కే.మధురిమ, కే.శిరీష , అనురాగ్ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షురాలు కే.అనితా రెడ్డి, బాల సదనం పర్యవేక్షణ అధికారి ఎం.కళ్యాణి, ప్రొటెక్షన్ అధికారి ఎస్.ప్రవీణ్ కుమార్, పొక్సో పి పి ఎం రంజిత్,సీనియర్ న్యాయవాది జీ.వినోద్ మల్లికాంబ మనోవికాస కేంద్రం నిర్వాహకురాలు రామలీల తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: