నేడు స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో 175 గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్క
రణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం
చౌటుప్పల్ మండల కేంద్రంలో జయశ్రీ ఫంక్షన్ హాల్లో మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 20వ
తేదీ స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా చౌటుప్పల్ మండలంలోని వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులకు రాజీవ్ గాంధీ చిత్రపలతో పాటు కాంగ్రెస్ పార్టీ జెండా
లను అందజేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్లమల్ల కృష్ణారెడ్డి
మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ జెండా పండుగలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ
కార్యకర్తలు అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రతి గ్రామాలలో ఉన్న నిరుపేదలకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. ఆగస్టు 20న నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి ఘనంగా నిర్వహిస్తామన్నారు.
Post A Comment: