ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఐడిఓసి మహిళా ఉద్యోగినిల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలని అన్నారు. కుటుంబ బాధ్యతలు చూస్తూ తనగురించి కానీ తన ఆరోగ్య విషయంలో ఎటువంటి జాగ్రత్త వహించటంలేదని ఆరోగ్య సదస్సులు కల్పించటం వలన మహిళా ఉద్యోగినిల విధి నిర్వహణ లో కుటుంబ బాధ్యత నిర్వహణలో చాలా చురుకుగా పని చేయగలరని నిర్ణయం తో డాక్టర్ వాణిశ్రీ హసన్ పర్తి డి.డీఎం&హెచ్. ఓ సలహాలు మహిళా ఉద్యోగినిలకు వివరించారు. కుటుంబ బాధ్యతలు గురించి ఆలోచిస్తారు కానీ స్వతహాగా ఆహారం విషయంలో సరైన ఆహారం తీసుకోవటం లేదు కనుక ఐరన్ లోపం సంభవించి నీరసం, అలసట, కల్లుతిరగటం , చేతులు , కాళ్లు , తిమ్మిర్లు పట్టడం విపరీతమైన తలనొప్పి , గోర్లు స్పూన్ వలె మార్పు రావటం వంటి సూచనలు ఉంటే అనీమియా లోపం అని గ్రహించి వెంటనే సరై న డాక్టర్ సలహా మేరకు ఐరన్ మాత్రలు, బికాంప్లెక్స్, సి విటమిన్ వంటివి క్రమం తప్పకుండా వాడాలని ఆహారం లో ఆకుకూరలు, పండ్లు, చిరు దాన్యాలు, గుడ్లు, నువ్వులు, బెల్లం, పల్లీలు ఇవి అన్ని మన అందుబాటు లో ఉండేవే కనుక తప్పక తీసుకోవాలని అవగాహన సదస్సు లో సవివరంగా అందరికీ తె లియచేశారు. ఈ కార్యక్రమం లో డిప్యుటి రిజిస్టర్ నీరజ మహిళా ఉద్యోగినిలను ఉద్దేశించి ఆరోగ్య పరిజ్ఞానం కలిపించేల ప్రసంగించారు ఈ కార్యక్రమం లో ఐడిఓసి మహిళా ఉద్యోగిని లు అందరూ పాల్గొన్నారు.

Post A Comment: