ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఆర్టిసి ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.
మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం లో వరంగల్ జిల్లా కలెక్టర్ గోపీతో కలిసి టి.ఎస్.ఆర్.టి.సి డి ఎల్ సి ( District level committee)సమావేశం లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలనీ, బస్ స్టాండ్ ప్రాంగణంలోకి ప్రైవేట్ వాహనాలు రాకుండా చూడాలని, సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు చేయాలని, అతిక్రమించి లోపలికి వచ్చిన వాహనాలపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పోలీస్ శాఖ సహకారం తీసుకోవాలని, ఎంట్రీ ఇన్, ఔట్ ఏరియాలో సి.సి. కెమెరాలు ఏర్పాటు చేయాలని, నో పార్కింగ్ - నో ఎంట్రీ జోన్ పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. బస్ స్టాండ్ ఆవరణ బయట నో పార్కింగ్ జోన్ లో పార్కింగ్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ట్రాన్స్పోర్ట్ అధికారులను ఆదేశించారు. రైల్వే స్టేషన్ ఆవరణలో బస్ వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రైవేట్ వాహనాల్లో తూఫాన్, ఆటోలలో నిబంధనలు అతిక్రమించి, పరిమితికి మించి ఎక్కువ మందిని ఎక్కించుకొని వెళ్తున్న వాటిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
కలెక్టర్ గోపీ మాట్లాడుతూ
బస్ ప్రాంగణం, ఆవరణ పరిశుభ్రం గా ఉంచాలని, శానిటేషన్ పెంచాలని, చెత్త ను మునిసిపల్ సిబ్బందికి అందించాలని, టాయ్లెట్ లు శుభ్రంగా ఉంచి ప్రయాణికుల మన్ననలు పొందాలని తెలిపారు.
ఈ సమావేశంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వి శ్రీదేవి, డిప్యూటీ ఆర్.ఎం. బి కృపాకర్ రెడ్డి, డి.ఎం లు సత్యనారాయణ,పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: