చిదినేపల్లి ప్రాథమిక పాఠశాలను మధ్యాహ్న భోజన సమయంలో పిఆర్టియు మండల ప్రధాన కార్యదర్శి అనపర్తి తిరుపతి సందర్శించడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా టాయిలెట్స్ లేకపోవడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా ఇక్కడ ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, విద్యార్థులు టాయిలెట్స్ లేకపోవడంతో బయట పరిసరాలకు వెళ్లడం వలన చుట్టుపక్కల చెట్లు పొదలు, మరియు విష పురుగులు , తేళ్ళు, పాముల వలన ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని, ఇప్పటికైనా పాఠశాల ఆవరణలో వెంటనే టాయిలెట్స్ నిర్మాణం చేపట్టే విధంగా సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలని, అవసరమైతే కలెక్టర్ తమ ప్రత్యేక నిధులతో ఇక్కడ టాయిలెట్స్ నిర్మాణం చేపట్టేందుకు కృషి చేయాలని కోరడం జరిగింది. వీరి వెంట ప్రధానోపాధ్యాయులు ఏ. భాగ్యలక్ష్మి, గ్రామ కార్యదర్శి దేవేందర్ ఉపాధ్యాయ సంఘం సీనియర్ నాయకులు ఎన్ సత్యం , ఉపాధ్యాయురాలు కావేరి మేడం ఉన్నారు.
Home
Telangana( తెలంగాణ )
చిద్నేపల్లి ప్రాథమిక పాఠశాలలో టాయిలెట్ నిర్మాణం వెంటనే చేపట్టాలి....PRTU TS మండల ప్రధాన కార్యదర్శి అనపర్తి తిరుపతి.
Post A Comment: