పెద్దపల్లి జిల్లా మంథని పరిధిలో 2021 ఫిబ్రవరి 17న జరిగిన హైకోర్టు లాయర్లు వామనరావు, నాగమణి దంపతుల హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
సీబీఐ IPC సెక్షన్లు 120బీ, 341, 302, 34 కింద కేసు నమోదు చేసి, వసంతరావు, కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్లు నిందితులుగా ఎఫ్ఐఆర్‌లో చేర్చింది.
మృతుల తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశాలు వెలువడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో సీబీఐ దర్యాప్తు ప్రారంభించడానికి మార్గం సుగమమైంది.
ప్రస్తుతం సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సాక్ష్యాలను సేకరిస్తూ దర్యాప్తు వేగవంతం చేస్తోంది. ఈ దర్యాప్తుతో నిజమైన నిందితులు బహిర్గతం అవుతారని కుటుంబ సభ్యులు, న్యాయవర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Post A Comment: